గత ఏడాదికాలంలో సోనూ సూద్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సోనూ సూద్ కి కోట్లలో అభిమానులు ఏర్పడ్డారు. మరి అలాంటి వ్యక్తి పాపులారిటీని పొలిటికల్ పార్టీలు వాడుకోవాలని చూడడం సర్వసాధారణం.  


ఒకప్పుడు సోనూ సూద్ అంటే ఒక సాధారణ నటుడు, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ శక్తి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచి, నిలుస్తూ ఆయన దేవుడయ్యాడు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బులను పేదల కోసం ఖర్చు చేస్తున్న కలియుగ కర్ణుడు. గత ఏడాదికాలంలో సోనూ సూద్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సోనూ సూద్ కి కోట్లలో అభిమానులు ఏర్పడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


మరి అలాంటి వ్యక్తి పాపులారిటీని పొలిటికల్ పార్టీలు వాడుకోవాలని చూడడం సర్వసాధారణం. హ్యూమనిస్ట్ గా, సోషలిస్ట్ గా పాప్యులర్ అయిన సోనూ సూద్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో అనేక ఊహాగానాలు, కథనాలు తెరపైకి వస్తున్నాయి. 


తాజాగా మహారాష్ట్రలో 2022లో జరగనున్న మేయర్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున సోనూ సూద్ ని బరిలోకి దింపాలని, ఆపార్టీ ప్రణాళికలు వేస్తున్నట్లు ఒకరు ట్వీట్ చేశారు. పరోక్షంగా సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు, ఎన్నికల బరిలో కూడా దిగుతున్నట్లు ఆ ట్వీట్ ఉంది. 


ఈ విషయం సోనూ సూద్ దృష్టికి రావడంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తాను రానున్న మహారాష్ట్ర మేయర్ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు. అలాగే ఒక కామన్ మాన్ గా తాను సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే గతంలో భవిష్యత్ లో పాలిటిక్స్ లో వస్తానేమో, ప్రస్తుతానికి లేదని సోనూ సూద్ చెప్పడం విశేషం. 

Scroll to load tweet…