Asianet News TeluguAsianet News Telugu

Sonu Sood భరోసా.. మీ నాన్నను కాపాడతాను .. యువకుడికి ఫోన్ చేసిన స్టార్ యాక్టర్

మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు స్టార్ నటుడు సోనూసూద్. తండ్రికోసం పరితపించే కొడుకు బాధను అర్ధం చేసుకోవడంతో పాటు.. సహాయం చేయడం కోసం ముందుకు వచ్చాడు. 

Sonu Sood steps up to help man dad in need of heart surgery JmS
Author
First Published Dec 7, 2023, 9:21 AM IST

ఎంతో మంది జీవితం కాపాడాడు స్టార్ యాక్టర్ సోనూసూద్. కరోనా టైమ్ నుంచి ఆయన చేస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు. అనారోగ్యంతో బాధపడుతున్నా, పేదరికంలో మగ్గుతున్నా.. బాగా చదవగలిగి.. చదువుకునేస్తోమత లేకున్నా.. ఇలా ఒకటి కాదు.. ఎంతో మంది జీవితంలో వెలుగులు నింపాడు సోనూసూద్. అంతే కాదు ఇంకా చేస్తూనే ఉన్నాడు. తాజాగా తండ్రి కోసం కొడుకు పడుతున్న బాధను అర్ధం చేసుకున్నాడు సోనూసూద్. సాయంచేయడానికి ముందుకు వచ్చాడు.  

ప్రాణాపాయస్థితిలో తండ్రి ఆరోగ్యం.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం తల్లడిల్లిపోయిన ఓ యువకుడు తన కష్టాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతా జాలి చూపించారు తప్పించి.. సాయం చేయడానికి ముందుకు వచ్చినవారు చాలా తక్కువ. దాంతో వెంటనే స్పందించాడు  నటుడు సోనూసూద్ అతని పోస్టుపై స్పందించడమే కాదు..సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సోనూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పోస్ట్ వైరల్ గా మారింది. 

 

ఉత్తరప్రదేశ్ లోని డియోరియాకు చెందిన పల్లవ్ సింగ్ అనే యువకుడు తన తండ్రి గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తోందని.. ఆయన బతకాలంటే శస్త్రచికిత్స అవసరం అని పూర్తి వివరాలతో ట్విట్టర్‌లో పోస్టు చేసాడు. ఆ పోస్టు చూసిన నెటిజన్లు చలించిపోయారు. పల్లవ్ సింగ్ పోస్ట్ లో ఏముందంటే..? నా తండ్రి త్వరలో చనిపోవచ్చు.. అవును నేను చెప్పేది నాకు తెలుసు. ఢిల్లీ ఎయిమ్స్‌లో క్యూలో నిలబడి ఇదంతా రాస్తున్నాను.. అంటూ వివరంగా ట్వీట్ చేసారు. పల్లవ్ సింగ్ తండ్రికి సెప్టెంబర్ 15 న గుండెపోటు వచ్చింది. తన స్వస్థలమైన డియోరియాకు దగ్గరలో గోరఖ్ పూర్‌లో ఉన్న ఆసుపత్రిలో చూపించాడు.తనకు మూడు సార్లు గుండె పోటు వచ్చింది.. ధమనుల్లో బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 

అయితే  ఆ ప్రభావంతో అతని గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తోందని వైద్యులు చెప్పారు. దాంతో పల్లవ్ సింగ్ తన తండ్రిని ఢిల్లీ AIMS కి తీసుకువచ్చాడు. అక్కడ పల్లవ్ సింగ్ తండ్రిని పరీక్షించిన డాక్టర్లు గుండె బలహీనంగా ఉందని, మందులు రాసి తర్వాత రమ్మని చెప్పారు. అతనికి శస్త్రచికిత్స చేయడానికి తేదీ లేదని ఆపరేషన్ జరగాలంటే 13 నెలలు వెయిటింగ్ లో ఉండాలన్నారు. అది కూడా లక్షలు చెల్లిస్తే కాని.. ఆపరేషన్ జరగదని తేల్చశారు. అయితే  అప్పటికే పల్లవ్ సింగ్ తండ్రి ఆరోగ్యం చాలా  క్రిటికల్‌గా ఉంది.

పల్లవి సింగ్  తల్లి కూడా అనారోగ్యంతో ఉన్నారు.. ఆమె  న్యూరోలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతోంది. పల్లవి సింగ్ చేసే చిన్న ఉద్యోగం.. వచ్చే కొంత జీతం తప్పించి అతనికి వేరే ఆధారం లేదు. ప్రైవేట్ గా చూపించే స్తోమత లేకపోవడంతో .. తన పరిస్థితిని సోషలక్ మీడియాలో వెల్లడించాడు. వెంటనేస్పంది.. ఆపన్నహస్తం అందించాడు సోనూ సూద్. ‘మేము మీ తండ్రిని చనిపోనివ్వము సోదరా.. నా వ్యక్తిగత ట్విట్టర్ ఐడీ ఇన్ బాక్స్‌కి డైరెక్ట్ గా నీ నంబర్ మెసేజ్ చేయండి.. దయచేసి ట్వీట్‌లో పోస్టు చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios