దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అని నిరూపించుకున్న సోనూ సూద్‌ ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు అంబులెన్స్  సర్వీస్‌ని ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అని నిరూపించుకున్న సోనూ సూద్‌ ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. `సోనూ సూద్‌ అంబులెన్స్ సర్వీస్‌` పేరుతో దీన్ని మంగళవారం ప్రారంబించారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో అంబులెన్స్ సర్వీసులు పడకేశాయి. మండలం, గ్రామ స్థాయిలో అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ వంటి రెండు మూడు నగరాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం అంబులెన్స్ సర్వీస్‌ని పట్టించుకోవడం లేదు. దీంతో సకాలంలో ఆసుపత్రికి చేరలేక ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్‌ ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. దీనిపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సోనూ సూద్‌ని చూసి ప్రభుత్వాలు సిగ్గుపడాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.