కలియుగ కర్ణుడు సోను సూద్ తన ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ పంచుకున్నాడు. తాను కరోనా నుండి కోలుకున్నట్లు తెలియజేశాడు. ఇటీవల సోనూ సూద్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోనూ సూద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కావడంతో పాటు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం జరిగింది. 


తాజా పరీక్షలలో తనకు కరోనా నెగిటివ్ గా రిజల్ట్ వచ్చినట్లు సోనూ సూద్ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సోనూ సూద్ సేవలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వందలాది మంది వలస కార్మికులను ఆయన సొంత ఖర్చుతో స్వగ్రామాలకు చేర్చారు. 


అలాగే ఆపదలో ఉన్న పలువురు పేదలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. దేశం మొత్తం  సోనూ సూద్ రియల్ హీరో అంటూ కొనియాడారు. తాజాగా ఓ కరోనా పేషెంట్ కి అత్యవసర చికిత్స అవసరం కావడంతో, ఆమె కోసం ఏకంగా ఎయిర్ అంబులెన్సు ఏర్పాటు చేశారు. ప్రత్యేక విమానంలో అంబులెన్సు ఎక్కించి, ఆమెను నాగపూర్ నుండి  హైదరాబాద్ కి తరలించడం జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.