మైనర్ బాలికలపై చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై ప్రముఖ నటుడు సోనుసూద్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని  అన్నారు.

మైనర్ బాలికలపై చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై ప్రముఖ నటుడు సోనుసూద్ స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో సోనుసూద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఎన్టీవీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. మనం చూసే విధానం తప్పుగా ఉంటే.. చెడు ఆలోచనలే వస్తాయని అన్నారు. 

ఇక, దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచార ఘటన చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అమ్నీషియా పబ్ వద్ద నుంచి బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు.