సినిమాల్లో(బాలీవుడ్)కి వచ్చిన కొత్తలో పాజిటివ్ రోల్స్ చేయాలనుకునేవాడట. కానీ తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో అన్నీ నెగటివ్ రోల్స్ వచ్చాయని తెలిపారు సోనూ సూద్.
రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న రీల్ విలన్ సోనూ సూద్(Sonu Sood) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తుతూ, హిందీ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌లో చెత్త సినిమాలు చేయకుండా సౌత్ సినిమాలు తనని కాపాడినట్టు తెలిపారు సోనూసూద్. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల `అచార్య`లో విలన్‌గా మెరిసిన సోనూసూద్ ప్రస్తుతం హిందీలో `పృథ్వీరాజ్` చిత్రంలో నటించారు. ఇందులో ఆయన చాంద్ బర్దాయి పాత్రలో కనిపించబోతున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాకి ఇంటర్వ్యూలిచ్చారు. సోషల్ మీడియాలో కథనాల ప్రకారం సోనూసూద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లో(బాలీవుడ్)కి వచ్చిన కొత్తలో పాజిటివ్ రోల్స్ చేయాలనుకునేవాడట. కానీ తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో అన్నీ నెగటివ్ రోల్స్ వచ్చాయని తెలిపారు. ఏ చిత్ర పరిశ్రమ అయినా తాను కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తనని హిందీలో చెత్త సినిమాలు చేయకుండా సౌత్ సినిమాలు కాపాడాయని పేర్కొని సంచలనాలకు తెరలేపారు.
తాను హిందీంతోపాటు సౌత్‌లోనూ నటించానని, ఒకానొక సమయంలో బాలీవుడ్‌ని వదిలేసి దక్షిణాది సినిమాలు మాత్రమే చేశానని తెలిపారు సోనూసూద్. అప్పట్లో అందరు తనని సౌత్‌లో ఎందుకు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించేవారని, అనుభవం కోసం చేస్తున్నాని చెప్పినట్టు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడైనా ఒక్కటే. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. బాలీవుడ్‌తో సహా దక్షిణాది ఇండస్ట్రీ అయిన సరే సినిమా బాగా లేకపోతే నడవదు. ప్రజలు సినిమా బాగా ఉంటేనే ఆదరిస్తారని చెప్పారు.
ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రస్తుతం ప్రేక్షకులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓ సినిమా బాగలేకపోతే మరో సినిమాకి వెళ్తున్నారు. బాగున్న చిత్రాలనే ఆదరిస్తారని చెప్పారు. మంచి సినిమాలు సౌత్‌లో ఇప్పుడు చాలా వస్తున్నాయని చెప్పారు సోనూ సూద్. ప్రస్తుతం ఆయన తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్నాడు. ‘తమిళరసన్’, ‘ఫతే’ చిత్రాల్లో కనిపించనున్నాడు.
