Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్.. వైరల్ అవుతున్న వీడియో..

రీల్ విలన్.. రియల్ హీరో సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఆయన సంచలన ట్వీట్ పెట్టారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..? 
 

Sonu Sood Sensational Comments About Odisha Train Accident victims JMS
Author
First Published Jun 4, 2023, 7:43 AM IST

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో కుటుంబాలు ఈ ప్రమాదంతో దిక్కుతోచనిపరిస్థితుల్లోకి వెళ్లిపోయియి. ఇప్పటికే దాదాపు 300 మంది  మృతి చెందినట్లు, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇంకా సహాయక చర్యలు జరుగుతున్నాయి.. అన్నీ పూర్తయ్యే సరికి..  మృతులు, క్షతగాత్రులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం తరువాత రాజకీయ నాయకులతో పాటు.. సినీతారలు కూడా ఈ విషయంలో స్పందించడం మొదలు పెట్టారు. అంతే కాదు తమ అభిమానుల ద్వారా బాధితులకు సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్.. ఇలా పెద్ద తారలంతా ప్రమాదంపై స్పందించారు.  

ఇక ఈ ప్రమాదంపూ తాజాగా స్పందించారు రియల్ హీరో్  సోనూసూద్.  బాధుల పక్షాన ఆయన  సంచలన ట్వీట్ చేశాడు. ఓ వీడియోను తన ట్విట్టర్ లో శేర్ చేశారు. ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె ముక్కలైంది. ప్రమాద బాధితులకు సానుభూతి తెలుపుతున్నాను. మనందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్యాగ్ లైన్ తో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆవీడియోలో మాత్రం సంచలన విషయాలు మాట్లాడారు సోనూ. 

 

ఆ వీడియోలో  

;

సోను సూద్ మాట్లాడుతూ.. మనం ఈ రోజు ప్రమాదం గురించి తెలుసుకొని ట్వీట్ చేస్తాం. నష్టపోయిన వారిపట్ల సానుభూతి చూపిస్తాం. కానీ కొన్ని రోజులకు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం.. మన పనుల్లో బిజీ అయిపోతాం.. గతంలో ఎన్నో ప్రమాధాల విషయంలో ఇలానేజరిగింది. ఈ కొన్ని రోజులు న్యూస్ ఐటమ్స్ గా బాధితులు మారిపోతున్నాయి. కాని ఆతరువాత వారి జీవితం ఏంటీ అనేది ఎవరూ పట్టించుకోరు. కానీ వీరిలో జీవనోపాధి కోల్పోయిన  కుటుంబాలను పోషించలేని వారి పరిస్థితి ఏంటి..?  ? ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడతాయా అని ప్రశ్నించారు. 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారం తాత్కాలిక ఉపశమనం మాత్రమే.. కాని ఆ పరిహారం  రెండు మూడు నెలల్లో అయిపోతుంది. అసలు అది వారి వైధ్యానికి కూడా సరిపోతుందో లేదో తెలియదు..  ఆ తర్వాత మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో తమ కుటుంబాన్ని పోషించే వారి కాళ్ళు, చేతులు తెగిపోయాయి. ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు సోనూ.. అంతే కాదు ఇలాంటి వాటికి మంచి పరిష్కారాలు కావాలి అన్నారు.  ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్ట పరిహారం చెల్లించి వదిలేయకుండా వారికి పెన్షన్స్ కానీ, స్థిరాదాయం కల్పించడం కానీ చేస్తేనే వారికి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం అని సలహా ఇచ్చారు రియల్ హీరో. ప్రస్తుతం సోనూసూద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios