లాక్‌డౌన్‌లో సోనూ సూద్‌ చేసిన సేవా కార్యక్రమాలు చూసిన నటి శిల్పాశెట్టి కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్రా.. సోనూకి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీంతో సోనూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

లాక్‌డౌన్‌ సమయంలో నటుడు సోనూసూద్‌ అశేషమైన సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్‌ హీరో అనిపించుకున్నారు. వెండితెరపై విలన్‌గా నటించినా, నిజ జీవితంలో హీరోని మించిన పనులు చేశారని దేశమంతా కొనియాడుతుంది. 

ఇప్పటికీ ఆయన తన సేవా కార్యక్రమాలను చేపడుతున్నాడు. ఈ విషయాలన్ని సాగరకన్య శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాల తనయుడు వియాన్‌ రాజ్‌కుంద్రా(8) గమనించాడు. సోనూలో తాను రియల్‌ హీరోని చూశాడు. తన స్కూల్‌ ప్రాజెక్ట్ లో భాగంగా `వైవిధ్యం చూపిన వ్యక్తులు` పేరుతో ఓ ప్రాజెక్ట్ ని రెడీ చేశారు. ఇందులోసోనూ సూద్‌ లాక్‌డౌన్‌ సమయంలో సేవా కార్యక్రమాలను చూపించారు. ఈ మేరకు ఓ యానిమేషన్‌ వీడియోని పంచుకున్నారు. శిల్పా శెట్టి దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ సోనూ సూద్‌కి అంకితం అని తెలిపింది. 

శిల్పా స్పందిస్లూ, ఇటీవల కొన్ని నెలలుగా జరిగిన అన్ని విషయాలను, నా ప్రియమైన స్నేహితుడు సోనూ సూద్‌ నిస్వార్థంగా చేసిన సేవా కార్యక్రమాలను, ప్రజల కోసం సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో భయంతో ఉండిపోయిన సందర్భంలో తాను మాత్రం ప్రజల కోసం బయటకు వచ్చాడు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించాడ`ని తెలిపింది.

ఇంకా చెబుతూ, వలస కార్మికులను ఆదుకున్న విధానం వియాన్‌ హృదయాన్నితాకింది. దాన్ని వియాన్‌ ఈ వీడియోలో చూపించాడు. తాను స్వయంగా ఈ యానిమేషన్‌ వీడియోని రూపొందించారు. ఈ వీడియోని మీ అందరితో పంచుకోవడం గర్వంగా ఉంది. అదే సమయంలో ప్రౌడ్‌ మమ్మీ మూవ్‌మెంట్‌. ఇది మీకోసం సోనూ` అని పేర్కొంది.

View post on Instagram

దీనికి సోనూ సూద్‌ స్పందించారు. `చాలా గౌరవంగా ఉంది. వియాన్‌, శిల్పా, రాజ్‌కుంద్రాలకు ధన్యవాదాలు. మా హీరో వియాన్‌ సూపర్‌ టాలెంటెడ్‌. అతని విషయంలో నేనూ గర్వపడుతున్నా` అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. శిల్పాశెట్టికి, రాజ్‌కుంద్రాకి 2009లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు వియాన్‌, కుమార్తె సమిషా ఉన్నారు. 

View post on Instagram