సోనూ సూద్ కత్తులకు సానబెట్టే సైకిల్ కమ్ మెషిన్ తొక్కుతూ కనిపించారు. మనం ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చేస్తాం. కానీ కత్తులు సానబెట్టే ఈ వ్యక్తికి మాత్రం ఇది వృత్తి, అలాగే వ్యాయామం కూడా అంటూ, స్వయంగా కత్తులకు సాన ఎలా పెడతారో, చేసి చూపించారు.
నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. అనేక సామాజిక అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఇక సోనూ సూద్ దానం గుణం ఏమిటో కొన్నాళ్లుగా దేశం మొత్తం చూస్తున్నారు. కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సోను సూద్, అనేక మంది పేద వారికి సహాయం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎలాంటి, సహాయం కోరినా అడిగించే తడవుగా సోనూ సూద్ తీర్చడం జరిగింది. సొంత డబ్బులు కోట్ల రూపాయలు.. సోనూ సూద్ సహాయక కార్యక్రమాలకు ఖర్చు చేశారు.
తాజాగా సోనూ సూద్ కత్తులకు సానబెట్టే సైకిల్ కమ్ మెషిన్ తొక్కుతూ కనిపించారు. మనం ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చేస్తాం. కానీ కత్తులు సానబెట్టే ఈ వ్యక్తికి మాత్రం ఇది వృత్తి, అలాగే వ్యాయామం కూడా అంటూ, స్వయంగా కత్తులకు సాన ఎలా పెడతారో, చేసి చూపించారు. సోనూ సూద్ కత్తులకు సాన పెడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా... వైరల్ గా మారింది. నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోనూ సూద్ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన పలు బాషలలో అనేక చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అల్లుడు అదుర్స్ మూవీలో నటించిన సోనూ సూద్, చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో ఓ కీలక రోల్ చేయడం జరిగింది. ఆచార్య మే 13న విడుదల అవుతుండగా, సోనూ సూద్ రోల్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది.
