Asianet News TeluguAsianet News Telugu

విదేశీ చిన్నారులను కాపాడబోతున్న సోనూసూద్‌.. చేతులెత్తి మొక్కుతున్న ఫిక్కీ

సోనూసూద్‌..ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌కి చెందిన రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని అందించారు. అలాగే అస్సాంకు చెందిన ఓ పేద మహిళకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుతున్నారు. 

sonu sood is going to save the lives of 39 filopino children
Author
Hyderabad, First Published Aug 14, 2020, 11:08 AM IST

సోనూ సూద్‌ దాతృత్వం గురించి, ఆయన చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో అనేక మంది సినీ కార్మికులను ఆదుకున్నారు. రోజుకు కొన్ని వేల మంది కార్మికులకు, పేద ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముంబయిలో చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకున్నారు. వారికి షెల్టర్‌ ఇవ్వడంతోపాటు తమ వద్ద ఉన్నన్ని రోజులు ఫుడ్‌ పెట్టి బాగా చూసుకున్నారు. అలాగే వారిని సురక్షితంగా తమ ప్రాంతాలకు బస్సుల్లో, ట్రైన్‌లో తరలించి రియల్‌ హీరో అనిపించుకున్నారీ రీల్‌ విలన్.  

సోనూసూద్‌..ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌కి చెందిన రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని అందించారు. అలాగే అస్సాంకు చెందిన ఓ పేద మహిళకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుతున్నారు. ఫిలిప్పిన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఏకంగా  ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం విశేషం. నేడు మనిలా నుంచి ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుంది. 

ఇంతటితో సోనూసూద్‌ సేవ ఆగిపోవడం లేదు. 39మంది చిన్న పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చారు. అయితే వారు మన దేశానికి చెందిన వారు కాదు. ఫిలిప్పిన్స్ కు చెందిన 39 మంది చిన్నారులు కాలేయ సంబంధిత బైలరీ అట్రీసియా వ్యాధితో బాధపడుతున్నారు. అందులో భాగంగా వారికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉంది. ఫిలిప్పిన్స్ లో ఉన్న ఈ చిన్నారులను ఇండియాకి తీసుకొచ్చి చికిత్స చేయించబోతున్నారు. వీరంతా ఐదేళ్ళలోపు చిన్నారులే కావడం విచారకరం. న్యూఢిల్లీలో ఓ ఆసుపత్రిలో లివర్‌ ట్రాన్స్ ఫ్లాంటేషన్‌ చేయాల్సి ఉందని సోనూ సూడ్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. 

కరోనా కారణంగా వీరు ప్రయాణం చేయడానికి కుదరకపోవడంతో, ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్‌ వారికి భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ఢిల్లీకి తీసుకొస్తానని, వారి విలువైన ప్రాణాలను కాపాడాల్సి ఉందని ట్వీట్టర్‌ ద్వారా గురువారం పేర్కొన్నారు. ఈ ఫిలిప్పిన్స్ చిన్నారులకు ఫిక్కీ సపోర్ట్ చేస్తుంది. ప్రయాణ సదుపాయం లేక ఇప్పటికే కొంత మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. సోనూ భరోసాతో తమకి ధైర్యం వచ్చినట్టు ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios