వేల సంఖ్యంలో సహాయం చేసి ఆపద్భాందవుడు అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ఆయన సహాయం కోరుతూ రిక్వెస్ట్ లు వచ్చేవి.. ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఓ నెటిజన్ ఫన్నీ రిక్వెస్ట్ పెట్టాడు సోనూకు.
వేల సంఖ్యంలో సహాయం చేసి ఆపద్భాందవుడు అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ఆయన సహాయం కోరుతూ రిక్వెస్ట్ లు వచ్చేవి.. ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఓ నెటిజన్ ఫన్నీ రిక్వెస్ట్ పెట్టాడు సోనూకు.
సాయం చేయాలంటూ అడిగిన ప్రతీ ఒక్కరికి చేతనైన సాయం చేస్తాడు సోనూసూద్. ఇప్పటకీ తమకు ఏదో ఒక సాయం చేయండంటూ.. సినీ నటుడు సోనూసూద్ కు చాలా మంది ట్వీట్లు చేస్తుంటారు. తనకు ట్వీట్ చేసే వారి సమస్యలను పరిష్కరిస్తూ సోనూసూద్ మంచి దేవుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సేవకుగానే సోనూసూద్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో కొన్ని ప్రాంతాలలో గుడి కూడా కట్టారు.
ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు కూడా సరదా కోసం సోనూసూద్ కు ట్వీట్ల్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో కూడా కొన్ని ఫన్నీ ట్వీట్లు ఆయనుక రాగా రీసెంట్ గా మరో ట్వీట్ తో ఫన్నీ గా సహాయం అడిగాడు ఓ నెటిజన్. అంత కాదు వారికి తగినట్టు ఫన్నీ రిప్లై ఇవ్వడంతో కూడా సోనూ మార్క్ స్పెషల్ గా ఉంటుంది.
తాజాగా, తాను భార్యా బాధితుడినంటూ, సాయం చేయాలంటూ సోనూసూద్‌కు ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. తనకు కూడా చికిత్స చేయించాలని కోరాడు. సోనూసూద్ అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారని, తన భార్య ప్రతి రోజు తన రక్తం తాగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో దానికి ఏదైనా చికిత్స ఉందా? అని ప్రశ్నించాడు. ఉంటే దయచేసి సాయం చేయాలని కోరాడు.
అంతే కాదు తాను సోనూసూద్‌ను ఒక భార్యా బాధితుడిగా చేతులు జోడించి సాయం అడుగుతున్నానని పేర్కొన్నాడు. దీనిపై తన స్టైల్లో స్పందించాడు. సోనూ సూద్. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అలా చేయడం ప్రతి భార్య జన్మ హక్కు అని రిప్లై ఇచ్చారు. ఆ రక్తంతో తనలాగే బ్లడ్ బ్యాంకును ప్రారంభించాలని చెబుతూ నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు.
