నేషనల్ హీరో సోనూసూద్ అభినవ కర్ణుడిగా గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరే వినిపించేది. అంతా సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
నేషనల్ హీరో సోనూసూద్ అభినవ కర్ణుడిగా గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరే వినిపించేది. అంతా సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విలయ తాండవం వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆర్థికంగా సోనూసూద్ ఆదుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించాడు. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వారిని సొంత రవాణా ఖర్చులతో స్వదేశాలకు చేర్చాడు.
సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కోట్లాదిమంది హృదయాలు గెలుచుకున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా సోనూ సూద్ కి అభిమానులు ఏర్పడ్డారు. సోనూసూద్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల కోలాహలం నెలకొంటోంది. సినిమాల్లో విలన్ వేషాల్లో నటించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జయరాం అనే సోనూసూద్ అభిమాని అందరిని ఆకర్షించాడు. త్రివర్ణ పతాకపు రంగులని ఒంటిపై పెయింటింగ్ వేసుకున్నాడు. మధ్యలో సోనూసూద్ బొమ్మ కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన సందర్శకులని జయరాం ఇలా ఆకర్షిస్తున్నాడు.

సోనూసూద్ పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాడు. ఇదే తరహా అభిమానులని మనం క్రికెట్ లో కూడా చూస్తూనే ఉన్నాం. సచిన్, ధోని, కోహ్లీ వీరాభిమానులు ఇదే తరహాలో శరీరంపై పెయింటింగ్ వేసుకుంటూ ఆకర్షిస్తుంటారు.
Also Read: Tabu warning: యంగ్ హీరోకి టబు వార్నింగ్.. అల్లు అర్జున్ మూవీనే కారణం
