Asianet News TeluguAsianet News Telugu

అంకుర హాస్పిటల్స్ ప్రచారకర్తగా నటుడు సోనూ సూద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేకించబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్ అంకుర హాస్పిటల్స్  ప్రముఖ నటుడు సోను సూద్ ను తన ప్రచారకర్తగా నియమించింది. అంకుర హాస్పిటల్ తన 10వ కేంద్రాన్ని ఎల్బీ నగర్ లో నేడు ప్రారంభించింది.

sonu sood as brand ambassador for ankura hospital  arj
Author
Hyderabad, First Published Feb 15, 2021, 10:25 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేకించబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్ అంకుర హాస్పిటల్స్  ప్రముఖ నటుడు సోను సూద్ ను తన ప్రచారకర్తగా నియమించింది. అంకుర హాస్పిటల్ తన 10వ కేంద్రాన్ని ఎల్బీ నగర్ లో నేడు ప్రారంభించింది. 50,000 చ.అ.ల 120 బెడ్ 10వ కేంద్రం అంకుర హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఇతర ప్రముఖుల సమక్షంలో నటుడు సోను సూద్ చే ప్రారంభించబడింది.

ఈ సందర్భంగా నటుడు సోను సూద్ మాట్లాడుతూ, `వైద్యులను నిజజీవితపు హీరోల కన్నా ఎక్కువగా ప రిగణిస్తారు. నిజానికి వారిని ‘దైవం’గా భావిస్తారు. ఎంతో నమ్మకంతో వారు మనల్ని, మనం అభిమానించే వారిని నయం చేస్తున్నారు. గత ఏడాది అలాంటి సందర్భాన్నే తీసుకువచ్చింది. యావత్ ప్రపంచాన్ని మార్చివేసిన సంఘటన. యావత్ ప్రపంచంలో తనకు తానుగా బందీగా మారిపోయింది. ప్రతీ ఒక్కరినీ కాపాడేం దుకు వైద్యులు, ఫ్రంట్ లైన్ ఆరోగ్యసంరక్షణ సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారు.

 నిస్వార్థ కఠోర పరిశ్రమ, త్యాగం, సమాజం పట్ల బాధ్యతలన నెరవేర్చే శక్తి ఈ వర్గానికి ఉందని నేను గుర్తించాను. వారు తమ కుటుం బం కోసం వెచ్చించే సమయాన్ని త్యాగం చేశారు. మనల్ని వారి కుటుంబంలో భాగం చేసుకున్నారు. అందు కే నేను ఈ ఉపకరానికి ప్రత్యుపకారం చేయదల్చాను. అంకుర ను నా కుటుంబంలో భాగం చేసుకుంటానని ప్రకటించేందుకు నేను సంతోషిస్తున్నాను. వారి దీర్ఘకాలిక భాగస్వామి కావడం మరియు మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించే ఈ నిపుణులతో అనుబంధం నాకెంతో ఆనందదాయకం. మన దేశ నిర్మాణంలో మహిళలు, శిశువులు ఎంతో కీలకమని నేను భావిస్తున్నాను. గతంలో నేను అంకుర హాస్పిటల్ తో కలసి పనిచేశాను. 

మహమ్మారి సందర్భంగా గైనకాలజీ, పిడియాట్రిక్స్ లలో కొన్ని క్రిటికల్ కేసులను నేను వారికి రెఫర్ చేశారు. వారు గణనీయ ఫలితాలను కనబర్చారు. అక్కడ చికిత్స పొందిన వారంతా కూడా నయమై, ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకున్నారు. అది నా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. తాను బోధించే అంశాలనే పాటించే ఆరోగ్యసంరక్షణ బ్రాండ్ తో మరింత తీవ్రంగా కలసి పని చేయాలని భావించాను. వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే మరియు వినూత్న ఎక్స్ పర్ట్ మెడికల్ కేర్ ను అందించే భవిష్యత్ అ నేది డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆశయం. ఇతరత్రాగా మెట్రోల్లో మాత్రమే ఇవి లభ్యమవుతున్నాయి. అంకుర జట్టు తో నేను జరిపిన సంభాషణల్లో, ఈ ఆశయ సాధనకు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు, మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణలో అంకురను అత్యంత విశ్వసనీయ బ్రాండ్ గా తీర్చిదిద్దినట్లుగా నేను గుర్తించాను. అంకురలో ప్రతి ఒక్కరు కూడా నిజమైన తేడాను సృష్టించడం పై మక్కువను కలిగిఉంటారు. ఆరోగ్యదాయక మహిళలు, పిల్లలతో జాతిని నిర్మించడంలో వారి ప్రయాణంలో నన్ను చేర్చుకుంటున్నందుకు అంకుర గ్రూప్ కు నా ధన్య వాదాలు` అని అన్నారు.


ఈ సందర్భంగా అంకుర హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, `సోను సూద్ ను మా ప్రచారకర్తగా కలిగి ఉండడం మాకెంతో ఆనందదాయకం. మానవ సమస్యలను పరిష్కరించడంలో ఆయన కారుణ్యం, సానుభూతి, సమగ్రత, విశ్వసనీయతలనే అంకుర హాస్పిటల్స్  లో మేము విశ్వసిస్తాం. అదే మా ఆశయం, కార్యాచరణ. మహిళలు, చిన్నారులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడంలో అంకుర కార్యాచరణకు శ్రీ సోను సూద్ తోడ్పడగలరని మేం విశ్వసిస్తున్నాం` అని అన్నారు. 

`ఎల్బీ నగర్ లోని మా 10వ కేంద్రంగా విస్తరించి ఉంది. అధునాతన సాంకే తికతతో కూడుకొని ఉంది. శిక్షణ పొందిన వైద్య వృత్తినిపుణులను, మౌలిక వసతులను కలిగిఉంది. రోగు లకు ప్రత్యేక సంరక్షణ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యూహాత్మక కేంద్రంగా సేవలందించనున్నాం. ఎందుకంటే ఇది, ప్రత్యేక వైద్య పరిసరాలను కోరుకునే పరిసర పట్టణాల ప్రజలకు ప్రపంచస్థాయి ఆరోగ్య సం రక్షణను అందించాలనే  అంకుర హాస్పిటల్స్ ఆశయాన్ని నెరవేరుస్తుంది.


ఎల్బీ నగర్ కేంద్రం  

 • నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్

• పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్

• పీడియాట్రిక్ న్యూరాలజీ

• పీడియాట్రిక్ కార్డియాలజీ

• పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ

పీడియాట్రిక్
గ్యాస్ట్రోఎంటరాలజీ

బర్తింగ్ సూట్స్

హై రిస్క్ ప్రగ్నెన్సీ

ఫిటల్ మెడిసిన్  

డెంటిస్ట్రీ మరియు ఇన్ ఫెర్టిలిటీ విభాగాల్లో అత్యాధునిక సదుపాయాలను కలిగిఉండడమే గాకుండా 24 గంటల ల్యాబ్, 24 గంటల ఫార్మసీ, 24 గంటల క్రిటికల్ కేర్ అంబులెన్స్ సర్వీస్ లను కూడా ఇది అదిస్తుంది` అని అన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios