కథానాయిక సోనమ్ కపూర్ వివాహం ఢిల్లీకి చెందిన యువ వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాతో మంగళవారం ఉదయం ముంబై బాంద్రాలోని రాకెడ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు వారం క్రితమే పచ్చజెండా ఊపేయడంతో వివాహ బంధంతో సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా ఒక్కటయ్యారు.