ఎట్టకేలకు తన మ్యారేజ్ గురించి నోరు విప్పింది హీరోయిన్, ఫ్యాషన్ బ్యూటీ సోనమ్‌కపూర్. స్విట్జర్లాండ్‌ లేదా ముంబైలో ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని వార్తల నేపథ్యంలో స్పందించింది. పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే చేసుకుంటానని, వేడుక కోసం లక్షలు ఖర్చు పెట్టలేనని తేల్చేసింది. అంత అవసరం లేదంటూనే కావాలంటే ఆ మనీని విరాళంగా ఇస్తానని తేల్చేసింది. తక్కువ ఖర్చుతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పద్ధతిగా జరగాలని, అందుకే ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలిపింది.

హీరోయిన్ సోనమ్‌‌కపూర్‌- బిజినెస్ మెన్ ఆనంద్‌ ఆహూజా కొంతకాలంగా ల‌వ్‌లో వున్నారు. వీళ్లకు ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వచ్చేనెల ఫస్ట్ వీక్‌లో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే పైవిధంగా చెప్పింది సోనమ్.