క్యాన్సర్ తో బాధ పడుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Sonali Bendre diagnosed with cancer
Highlights

90లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో నటించిన ఈమె అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన జతకట్టి తన సత్తా చాటింది

90లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో నటించిన ఈమె అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన జతకట్టి తన సత్తా చాటింది. అటువంటిది ఆమెకు క్యాన్సర్ కు గురైనట్లు తెలుస్తోంది. తనను క్యాన్సర్ వ్యాధి ఇబ్బంది పడుతోందని సోనాలి బింద్రే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ కు గురయ్యారు. ట్విట్టర్ లో తన పరిస్థితిని వివరిస్తూ.. ''చిన్న నొప్పి రావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. అప్పుడు నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. సమస్య ఏంటి అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఊహించని వ్యాధి మాత్రం సోకిందని తెలిసింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ సపోర్ట్ ను అందిస్తున్నారు. ఈ వ్యాధిని అరికట్టడానికి వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి దశలో ఈ క్యాన్సర్ పై పోరాడాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం, సన్నిహితులు ఇచ్చే సపోర్ట్ తో ఈ క్యాన్సర్ పై నేను పోరాడతాను'' అంటూ వెల్లడించింది. తమ అభిమాన నటి క్యాన్సర్ టో బాధ పడుతుందని తెలుసుకున్న అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు.  

 

loader