Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోయిన్ పై అసభ్యకర వ్యాఖ్యలు.. యువకుడి అరెస్టు

బాలివుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏండ్ల యువకుడని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దబాంగ్ ఫేమ్‌ సోనాక్షి ఇటీవల తనపై ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయటం జరిగింది.

Sonakshi Sinhas cyber bully arrested
Author
Hyderabad, First Published Aug 22, 2020, 7:49 AM IST


సోషల్ మీడియాలో తాము ఎవరికి తెలియదు కదా అని సెలబ్రెటీలను వేధించటం చాలా మందికు ఓ అలవాటుగా మారింది. కొందరు స్టార్స్ ..సర్లే మనకెందుకులే అని ఆ మనస్తాపాన్ని మౌనంగా భరిస్తున్నా..మరికొందరు మాత్రం పోలీస్ కేసులు పెట్టి , అలాంటి వాళ్లను జైలుకు పంపుతున్నారు. తాజాగా ముంబైకు చెందిన సైబర్ సెల్ పోలీస్ లు 27 సంవత్సరాల కుర్రాడిని స్టార్ హీరోయిన్ సోనాక్షిని వేధిస్తున్నందుకు అరెస్ట్ చేసారు. ఈ విషయమై ఆమె వీడియో విడుదల చేసారు.
 
వివరాల్లోకి వెళితే...బాలివుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏండ్ల యువకుడని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దబాంగ్ ఫేమ్‌ సోనాక్షి ఇటీవల తనపై ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయటం జరిగింది.

ఆ వీడియోలో సోనాక్షి ఆన్‌లైన్లో వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పాలని కోరారు. ‘ఆన్‌లైన్ ప్రపంచం సురక్షితం అని భావించడం లేదు. కానీ నేను మౌనంగా ఉండను. దుర్వినియోగాన్ని సహించబోను. మీరూ ఆన్‌లైన్ వేధింపుపై కలిసి రండి. ఆన్‌లైన్ వేధింపులు నేరం. మీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అధికారం ఇతరులకు ఇవ్వవద్దు’ అని వీడియోలో పేర్కొన్నారు. సైబర్ బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర పోలీసులు, సైబర్ నిపుణులతో కలిసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. 

ఇక కొద్ది నెలల క్రితం సోనాక్షి.. నెగిటివిటికి దూరంగా ఉండాలి అనుకుంటుందంట. మనఃశాంతిని కాపాడు​ కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  వెల్లడించింది.  సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్‌ కిడ్స్‌ని అన్‌ ఫాలో చేస్తూ, ట్రోల్‌ చేస్తున్న ఈ తరుణంలో సోనాక్షి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంతా భావించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios