డైలాగ్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) హీరోగా డైమండ్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ  ప్రి రిలీజ్ ఈవెంట్... హైదరాబాద్ లోని పార్క్ హయత్  హొటల్ లో  ఘనంగా జరిగింది.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) హీరోగా డైమండ్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్... హైదరాబాద్ లోని పార్క్ హయత్ హొటల్ లో ఘనంగా జరిగింది.

ఈనెల 28న రిలీజ్ కాబోతోంది మంచు మోహాన్ బాబు(Mohan Babu) హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో..మంచు విష్ణు నిర్మించిన ఈమూవీ ప్రిరిలీజ్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మోహన్ బాబు తో పాటు విష్ణు, మంచు లక్మీ, సీనియార్ స్టార్ నరేష్ కూడా పాల్గొన్నారు.

ఇక ఈ వెంట్ లో మోహన్ బాబు(Mohan Babu) మాట్లాడుతూ.. నా కుటుంబానికి ఊపిరి సినిమా. ఏమిలేకుండ వచ్చి అంచలంచెలుగా ఎదిగి ఒక యునివర్సిటీ అయ్యింది. 1982 లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అన్న గారితో స్టార్ట్ చేయించాను...జీవితం లో కొన్ని కొన్ని రిస్క్ చేయాలి చేశాను. అది ఇలా బెట్టింది. జీవితం లో రిస్క్ లేకుండా ఎది జరుగదు..రిస్క్ అనేది తగిన రీతి లో చెయ్యాలి అన్నారు.

రత్న బాబు కథ చెప్పినప్పుడు వెంటేనే ఓకే చేశాను. విష్ణు కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమాలో రాజకీయం ఉంది ,ఫ్యామిలీ వుంది .పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి.ఇందులో ఒక్క సాంగ్ కోసం డబ్బుల ను లెక్క చేయకుండా ఖర్చు చేశాం..కష్ట పడ్డాము సాంగ్ బాగా వచ్చిందన్నారు. ఈ సినిమాలో రాజకీయాలపై అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి అన్నారు. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ వండర్ ఫుల్ ..రిస్క్ అయిన సినిమా తీశాం. బాగా వచ్చింది ఫ్యామిలీ తో సినిమా చూడండి, ఇందులో నటించిన ఆర్టిస్టులకు టెక్నిషియన్స్ కు థాంక్స్ అన్నారు మోహన్ బాబు.

 ఈ సందర్భంగా మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాట్లాడారు. లాక్ డౌన్ లో ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎందుకు అన్నాము. కాని డాడీ ఎంతో ఫెషన్ తో సినిమాని చేసారు. డైమండ్ రత్నాబాబు ఈ సినిమా చూసి పది మంది నేర్చుకోవాలి అని తీశారు. ఇళయ రాజా గారిని ఇలా కాదు ఇలా అని చేప్పి మరీ మ్యూజిక్ చేయించిన వ్యక్తి డాడి. డాడీ..చంద్రమండలం లో వున్నది అడిగిన అది తెచ్చి ఇస్తాడు విష్ణు. హాట్సాఫ్ విష్ణు అన్నారు లక్ష్మి.

ఇక సీనియర్ స్టార్ నరేష్ (Naresh) మాట్లాడుతూ..అందరికీ అన్న మా అందరికీ పెద్దన్న మోహన్ బాబు గారి కి అభివందనాలు. మా రెండు కుటుంబాల అనుబంధం అల్లూరి సీతారామరాజు దగ్గరనుంచి ఇప్పటికీ పెరుగుతూనే వుంది. గొప్ప విలన్ లు వున్నారు గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వున్నారు అన్ని కలిపి వున్నది ఒకేఒక్క మోహన్ బాబు(Mohan Babu) గారు. సినిమా కోసం పుట్టిన వ్యక్తి, సినిమాకోసం బతికే వ్యక్తి మోహన్ బాబు గారు. తెలుగు లో ఇటువంటి వ్యక్తి ఉన్నందుకు గర్వ కారణం.సన్ ఆఫ్ ఇండియా చూడడానికి ఇళయ రాజా చేసిన సాంగ్స్ లో ఒక్క సాంగ్ చాలు. ఈ సినిమా బాగా ఆడాలి.ఈ కుటుంబం బాగుండాలి అన్నారు.

ఇక ఈ సినిమా మంచి సంకల్పం తో తీసిన సినిమా . ఇది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మోహన్ బాబు(Mohan Babu) గారు ఎప్పుడు లొకేషన్ లో వుండాలి మీరు వుంటే చుట్టూ ఎనర్జీ వుంటుంది అన్నారు కమెడియన్ కమ్ హీరో సునిల్. దర్శకుడు రత్నబాబు డైమండ్ మాట్లాడుతూ..నా ఆలోచనకు ప్రాణం పోసిన వ్యక్తి మంచు విష్ణు గారు. సినిమా చాలా బాగా వచ్చింది. మోహన్ బాబు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నిర్మత విష్ణు మాట్లాడుతూ...ఈ సినిమా లో చాలా మంది ఆర్టిస్టులు చేసారు. వాళ్ళందరూ మా మీద ప్రేమతో.. కొందరు భయంతో కొందరు చేశారు.. అందరికీ థాంక్స్ అంటూ ముగించారు.