Asianet News TeluguAsianet News Telugu

ఇదేం ట్విస్ట్ ? జిన్నా,సన్నాఫ్ ఇండియా లకు ఓటీటిలో ఫ్రీ కాదా

మోహన్ బాబు  నటించిన లేటెస్ట్ మూవీ ‘సన్నాఫ్ ఇండియా’. ముందు నుంచి ఈ సినిమాను ఓటీటీ కోసం తెరకెక్కించినట్టు చెప్పినా.. చివరకు థియేట్రికల్‌గా ఫిబ్రవరి 18న  రిలీజ్ చేశారు. 

Son Of India, Ginna Available Only On Rent In U.S
Author
First Published Dec 4, 2022, 4:07 PM IST


మంచు కుటుంబం నుంచి వస్తున్న సినిమాలు ఏమీ ఈ మధ్యకాలంలో వర్కవుట్ కాలేదు. వరసపెట్టి సినిమాలు చేస్తున్నా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్  జరుగుతోంది. రీసెంట్  రిలీజ్ లు సన్నాఫ్ ఇండియా,జిన్నా రెండింటి పరిస్దితి అదే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమేజాన్ ప్రైమ్ లో ఇవి ఉన్నాయి. ఇండియా వరకూ ఏ సమస్యా  లేదు కానీ అమెరికాలో మాత్రం ఇవి చూడాలంటే రెంట్ పే చేయాలి. 

 USA లో అమెజాన్ ప్రైమ్ సబ్ స్కైబర్స్ కు ఇవి పే ఫర్ వ్యూ బేసిస్ లో లభ్యమవుతున్నాయి.  చూడాలనుకుంటే  $2.99  పే చెయ్యాల్సి ఉంటుంది. చాలా రోజులు రిలీజ్ తర్వాత ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమాలకు రెంట్ వసూలు చేస్తూండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.  అయితే ఓటిటి వారితో ఎగ్రిమెంట్స్ వలన ఇలా పే చేసిన తర్వాత మాత్రమే చూసే ఆప్షన్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇండియాలో ఆ సమస్య లేదు. ఇక్కడ అమేజాన్ లో మామూలుగా మిగతా సినిమాల్లాగే చూడవచ్చు.

ఇక మోహన్ బాబు  నటించిన లేటెస్ట్ మూవీ ‘సన్నాఫ్ ఇండియా’. ముందు నుంచి ఈ సినిమాను ఓటీటీ కోసం తెరకెక్కించినట్టు చెప్పినా.. చివరకు థియేట్రికల్‌గా ఫిబ్రవరి 18న  రిలీజ్ చేశారు. ఈ సినిమాను మోహన్ బాబు సొంతంగా 350 థియేటర్స్‌లో రిలీజ్ చేసుకున్నారు. అందులో వందకు పైగా షోలు ప్రేక్షకులు లేక క్యాన్సిల్ అయ్యాయి.  ఈ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చూసి అందరు నోరెళ్ల బెట్టారు.  కొన్ని చోట్ల ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చూసేందుకు  ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి.

ఇక ‘సన్నాఫ్ ఇండియా’  విడుదలకు ముందు ఈ సినిమాపై ట్రోలింగ్స్ నేపనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు కాస్తో కూస్తే చెపుకోదగ్గ కలెక్షన్స్ వస్తాయనుకున్నారు. కానీ అవేవి ఈ సినిమాకు కాసుల వర్షం  తెప్పించలేకపోయాయి. చాలా చోట్ల థియేటర్స్ నిర్వాహకులకు కనీసం కరెంట్, రెంట్, క్యాంటీన్, పార్కింగ్ వంటి  మెయింటెన్స్ కూడా రాలేదు.  

మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా (Ginna) అట్టర్‌ ప్లాఫ్‌ అని తేలిపోయింది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్‌ 21న మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.  వీటితోపాటే విడుదలయిన మంచు విష్ణు జిన్నా మాత్రం ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కూడా దక్కించుకోలేకపోయింది. అందాల భామలు.. పాయల్‌ రాజపుత్ (payal rajputh), సన్నీ లియోన్‌ (sunny leone)లు తమ అందాలను ఆరబోసినా ఈ సినిమాను కాపాడలేకపోయారని ట్రేడ్‌ వర్గాలు అన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios