Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య, చిరులపై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ దారుణ ట్రోలింగ్.. కారణం అదే?

ఇప్పుడు వారసుడు సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ఆయన ఇప్పటికీ థియేటర్ బ్లాక్ చేయడం మొదలుపెట్టినట్లు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 

Some Vijay overenthusiastic fans are trolling Megastar and Balakrishna
Author
First Published Nov 14, 2022, 9:45 AM IST


సోషల్ మీడియాలో వ్యవహారాలు, ఫ్యాన్స్ వార్స్ గమ్మత్తుగా ఉంటాయి. తమ హీరో గొప్పోడు అంటే మా హీరో తోపు అంటూ చిన్న చిన్న విషయాలకే ఫైటింగ్స్ షురూ చేస్తూంటారు. తమ హీరో కాకుండా వేరే హీరో గొప్పతనం పొరపాటున కూడా ఒప్పుకోరు. అంతకు మించి ట్రోలింగ్ కు పాల్పడుతూంటారు. తమిళనాడుకే చాలా కాలం పరిమితైన ఈ వ్యవహారాలు ఇప్పుడు తెలుగునాట కూడా కామన్ అయ్యిపోయాయి. అయితే తమిళ హీరో ఫ్యాన్స్ వచ్చి తెలుగు హీరో లను ట్రోల్ చేయటం మాత్రం అరుదుగా జరుగుతూంటుంది. తాజాగా అలాంటిది ఒకటి ట్విట్టర్ లో మొదలైంది. 

తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ ... చిరంజీవి, బాలయ్యను ట్రోల్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. వీడియోలు వదులుతున్నారు. అందుకు కారణం వారసడు చిత్రం సంక్రాంతి రేసులో ఉండటమే. రీసెంట్ గా తెలుగులో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. 2023 సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అలాగే బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమాలు విడుదల ఎందుకు రంగం సిద్ధమైన నేపధ్యంలో ఈ ట్రోలింగ్ యుద్దం మొదలైంది.  వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా నిర్మించిన వారసుడు సినిమాని కూడా అదే సమయంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

 విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాని మొదట బై లింగ్యువల్ మూవీ అని చెప్పినా సరే తరువాత ఈ సినిమాని తమిళ రిలీజ్ సినిమా అని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. డైరెక్ట్ తమిళ సినిమాను తమిళనాడులో డైరెక్ట్గా రిలీజ్ చేయడం కాస్త ఈజీనే. టాక్సులు కాస్త తక్కువగా ఉంటాయి.ఈ నేపధ్యంలో  ...బాలయ్య, చిరు లపై విజయ్ ఫ్యాన్స్ దండయాత్ర ప్రారంభించారు. మరో ప్రక్క నిర్మాత దిల్ రాజు పై మెగాస్టార్ అభిమానులు బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.ఒక డబ్బింగ్ సినిమా కోసం స్టార్ హీరోల సినిమాలు అడ్డుకుంటావా అంటూ సోషల్ మీడియా వేదిక మండిపడుతున్నారు.
 
ఈ వారసుడు సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ఆంధ్ర నైజాం లో ఎక్కువ థియేటర్లను దిల్ రాజు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హీరో కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరు, బాలయ్య సినిమాలకు గండిగొడతావా అంటూ దిల్ రాజుపై కోప్పడుతున్నారు.వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన మార్కెట్ రూ.9 కోట్లని.దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలకు అడ్డుపడతారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios