శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున.. అభిజిత్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. పిల్లలు ఎలా పడుతారని హారికని అడిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేశాడు. పంచ్‌లపై పంచ్‌లు వేస్తూ, చివరికి పిల్లలు ఎలా పడతారో చెప్పాడు నాగార్జున. పిల్లలు ఏడుస్తూ పుడతారని చెప్పి అందరిని నవ్వించాడు. అయితే హౌజ్‌లో అవినాష్‌ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం వినోదం కరువైంది. 

మరోవైపు సోహైల్‌ నిజంగా నక్కతోక తొక్కాడనే చెప్పాలి. ఎందుకంటే 14 వారంలో ఆయన పూర్తిగా డల్‌ అయిపోయాడు. అరియానాతో జరిగిన వివాదంలో, అంతా సోహైల్‌దే తప్పు అనే పరిస్థితులు తీసుకొచ్చాడు. నాగార్జున కూడా గతంలో తన కోపం గురించి చెప్పాడు, శనివారం మరోసారి హెచ్చరించాడు. అరియానాకి కూడా క్లాస్‌ పీకాడు. కానీ ఈ వివాదాన్ని పటాపంచల్‌ చేస్తూ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ టాప్‌ ఫైవ్‌లో చోటు సంపాదించాడు. 

ఇప్పటిక గత వారం టాస్క్ లో భాగంగా ఫైనల్‌కి అఖిల్‌ వెళ్లగా, శనివారం ఫైనల్‌కి వెళ్లే వారిని రివీల్‌ చేస్తామని నాగ్‌ చెప్పారు. సేవ్‌ చేయడం కాకుండా డిఫరెంట్‌గా ఇలా చేశారు. అఖిల్‌ బోర్డ్ పై తెరతీయగా, సోహైల్‌ ఫైనలిస్ట్ గా వచ్చింది. దీంతో సోహైల్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అయితే సోహైల్‌ ఫైనల్‌ ఎంపికైన సమయంలో అరియానాలో బాధ కనిపించడం గమనార్హం. ఆమెలో మరింత బాధ, నిరాశ కనిపించాయి. ఈ వారం జరిగిన వివాదాల్లో సోహైల్‌ పరిస్థితి ఆయోమయంగా తయారైంది. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ సోహైల్‌ ఫైనల్‌కి వెళ్లడం విశేషం. 

ఫైనల్‌కి వెళ్ళాల్సింది ఇంకా ముగ్గురు. బయట అభిజిత్‌, హారిక, మోనాల్‌, అరియానా ఉన్నారు. వీరిలో ఫైనల్‌ కి వెళ్లేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ద సస్పెన్స్ నెలకొంది. అభిజిత్‌, హారిక కచ్చితంగా ఫైనల్‌కి వెళతారు. మూడో వ్యక్తి అరియానా, మోనాల్‌ మధ్యే ఉంటుందని, వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు, ఎవరు ఫైనల్‌కి వెళ్తారనే ఉత్కంట నెలకొంది. మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందనేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలనుంది.