బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరిన సోహెల్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవడం జరిగింది. సోహెల్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని... నాగార్జున అభినందించడం జరిగింది. అలాగే సోహెల్ కి అదనంగా మరో పదిలక్షలు ప్రకటించగా, మొత్తం రూ. 35 లక్షల రూపాయలు దక్కాయి. అయితే సోహెల్ డబ్బులు తీసుకొని నిష్క్రమించడం వెనుక పెద్ద స్కామ్ ఉందని నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. బిగ్ బాస్ ఫైనల్ కి ముందు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్, సోహెల్ కి సైగల ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. నీ ప్లేస్ మూడు... టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి డబ్బులు ఆఫర్ చేస్తే, తీసుకొని బయటికి వచ్చేయమని మెహబూబ్ సైగల ద్వారా చెప్పాడని నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. 

మెహబూబ్ సోహైల్ కి ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు అనడానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది. మెహబూబ్, సోహైల్ కలిసి రూ. 25 లక్షలు స్కామ్ చేశారంటూ వాళ్ళిద్దరినీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు సోహెల్ దీనిపై స్పందించాడు. ఆ రోజు మెహబూబ్ సైగలు చేసింది నిజమే కానీ, నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆ విషయాన్ని నేను హౌస్ లో అఖిల్ తో చెప్పాను అన్నారు. కావాలంటే వీడియో ఫుటేజ్ చెక్ చేసుకోమన్నాడు. ఒక వేళ నాది థర్డ్ ప్లేస్ అని ముందుగా అవగహన ఉంటే రూ. 20 లక్షలు ప్రకటించినప్పుడే ఒప్పుకునేవాడిని , కానీ రూ. 25 లక్షలకు పెంచినప్పుడు పేరెంట్స్ కూడా తీసుకోమనడంతో ఒప్పుకున్నానని సోహెల్ వివరణ ఇచ్చారు. 

మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు రూ. 25 లక్షలు అంటే చాలా ఎక్కువ అందుకే నేను డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాను అన్నారు. ఒకవేళ ఫైనల్ కి అఖిల్, నేను వెళితే ప్రైజ్ మనీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నాం. నా నిర్ణయం వలన టాప్ టూ కి వెళ్లాలన్న అఖిల్ కోరిక తీరింది, అలాగే నాకు రూ. 25 లక్షలు వచ్చాయని చెప్పాడు. మేమేదో బ్యాంకులను దోచినట్లు ట్రోల్ చేయడం సరికాదని సోహెల్ తెలియజేశాడు.