బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కాగా విజేత ఎవరు కానున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. హౌస్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ లో ఒకరు విజేత కానున్నారు. ఇప్పటికే కొంత సమాచారం దీనిపై బయటికి రావడం జరిగింది. అరియనా, హారిక నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారని సమాచారం. కాగా బిగ్ బాస్ లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. 
 
ఇద్దరు నిష్క్రమణతో టైటిల్ కోసం అభిజీత్, అఖిల్ మరియు సోహైల్ పోటీపడగా... మూడోస్థానం విషయంలో అఖిల్ మరియు సోహైల్ మధ్య పోటీ నడిచిందట. టాప్ టూ లోకి అభిజీత్ కి వెళ్లగా, అఖిల్ మరియు సోహైల్ ఒకరు టాప్ టూకి వెళ్ళతారని హోస్ట్ నాగార్జున చెప్పారు. టాప్ టూ కి వెళ్ళబోయేది ఎవరో తెలిసేలోపు రూ. 25 లక్షలు తీసుకొని నిష్క్రమించవచ్చని చెప్పారట. 
 
ఈ విషయంలో కొంత టెన్షన్ కొనసాగగా... సోహైల్ రూ. 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకుంటానని చెప్పాడంట.దీనితో టాప్ టూ కి అభిజీత్ మరియు అఖిల్ చేరుకొని టైటిల్ కోసం పోటీపడ్డారట. కాకపోతే ఓటింగ్ ప్రకారం అఖిల్ కంటే ముందున్న సోహైల్ టాప్ టూ పొజిషన్ చేజార్చుకున్నాడు. సోహైల్ డబ్బులు తీసుకొని నిష్క్రమించడంతో అఖిల్ టైటిల్ గెలుచుకొనే అవకాశం పొందారట.