బిగ్‌బాస్‌4 శుక్రవారం ఎపిసోడ్‌లో నవ్వడం నిషేధం టాస్క్ లో ఒకరు నవ్విస్తుంటే, మిగిలిన వాళ్లు నవ్వుని ఆపుకుని సీరియస్‌గా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా లాస్య, అరియానా, సోహైల్‌, అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. అవినాష్‌ టైమ్‌లో చాలా మంది నవ్వారు. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. 

సోహైల్‌ని ఉద్దేశించి `ఏందీ పంచాయితీ..` అన్నాడు బిగ్‌బాస్‌. దీనికి చాలా మంది నవ్వారు. సోహైల్‌ కూడా నవ్వుని ఆపుకుని సమాధానం చెప్పాడు. `కథ ఎట్టుంది` అని బిగ్‌బాస్‌ అడగ్గా, సోహైల్‌ స్పందిస్తూ, కథ వేరే లెవల్‌లో ఉంది సోహైల్‌ చెప్పాడు. ఇంకా చెబుతూ, హౌజ్‌లో జీవితం కనిపిస్తుందని, కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు, ఇలా అన్నీ ఉన్నాయన్నాడు. జీవితంలో అంటే అన్ని ఉంటాయని హౌజ్‌లోనే చూపిస్తున్నారని చెప్పాడు. జీవితంపై ధైర్యాన్నిచ్చారని, బయటకు వెళ్లాకు ధైర్యంగా ఉండొచ్చనేలా చేశారని తెలిపాడు. 

కన్నీళ్ళు, బాధలు ఉన్నాయని, చాలా ఎమోషన్స్ ఉన్నాయని, అన్ని రకాల ఫీలింగ్‌ కలిగిస్తున్నారని, అందుకు బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ తన గురించి, తన మాటలను గుర్తించి తనతో మాట్లాడమే గొప్ప అని, అందుకు తాను నవ్వినా ఫర్వాలేదన్నాడు. అందుకు సంతోషిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత మెహబూబ్‌ కుందేలు గెటప్‌లో, సోహైల్‌ జోకర్ గెటప్‌లో వచ్చి నవ్వించారు.