క్రికెటర్ రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోహిత్ తో ఒకప్పుడు ప్రేమలో ఉన్న మాట నిజమేనని చెప్పిన సోఫియా 2012లో ఇద్దరూ డేటింగ్ చేసినట్లు స్పష్టం చేసింది. మొదటిసారి కలిసినప్పుడే రోహిత్ తనను ముద్దు పెట్టుకున్నాడని మరో సంచలనానికి తెరతీసింది.

లండన్ లో ఓ క్లబ్ లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని చెప్పింది. మోడల్ గా, బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా గుర్తింపు ఉన్న సోఫియా త్వరలోనే తన జీవితంపై ఓ పుస్తకం రాయాలనుకుంటున్నట్లు మీడియాతో  చెప్పింది.

ఈ పుస్తకంలో రోహిత్ శర్మతో తనకున్న రిలేషన్ గురించి ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించింది. రోహిత్ ని ఓ స్నేహితురాలి ద్వారా 2012లో కలిశానని, అప్పటికి రోహిత్ ఎవరో తనకు తెలియదని చెప్పిన సోఫియా ఆ తరువాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ కలిగాయని తెలిపింది. 

మీడియా దృష్టి పడనంత వరకు రోహిత్ బాగానే ఉన్నాడని, మీడియా ప్రశ్నిస్తుండడంతో తను నా అభిమాని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని, ఈ విషయం బాధించడంతో అతడితో విడిపోయినట్లు స్పష్టం చేసింది. ఈ విషయాలన్నీ కూడా తను రాయబోయే పుస్తకంలో ఉంటాయని సోఫియా వెల్లడించింది.