రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో నటి సోఫియా హయత్ చేసిన కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో రిలేషన్షిప్ గురించి సోఫియా కామెంట్స్ చేయడంతో విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆ ట్వీట్లు ఫోటోషాప్ చేసి కొన్ని వెబ్ సైట్ వాళ్లు కథనాలు ప్రచురించినట్లు సోఫియా చెబుతోంది. దయచేసి ఇలాంటి అవాస్తపు వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరింది. ముందుగా విరాట్ గురించి మాట్లాడుతూ.. ''విరాట్ కి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మా మధ్య శారీరకంగా ఏం జరగలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక రోహిత్ శర్మతో ఉన్న ఎఫైర్ ని అంగీకరించింది. రోహిత్ తో కొన్నాళ్లు రిలేషన్షిప్ ఉన్నట్లు చెప్పిన సోఫియా ఆ తరువాత అభిప్రాయబేధాలు రావడంతో విడిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నామని దయచేసి ఇలాంటి వార్తలను ప్రచురించకండి అంటూ రిక్వెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ట్వీట్లు తను పెట్టినవి కాదని మరోసారి స్పష్టం చేసింది.