Asianet News TeluguAsianet News Telugu

'సాహో' డైరక్టర్ పై ఎటాక్ మరీ ఈ స్దాయిలోనా?

సుజీత్ ...లార్గో వించ్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ అస్సలు చూడలేదని అనటం కామెడీ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో అంత   350 కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు చెప్తుంటే మీరు నమ్మకపోతే ఎలా అంటూ బ్రహ్మానందం ఎక్సపెషన్ పెడుతున్నారు.  
 

Socical Media Criticism on Saaho Director comments
Author
Hyderabad, First Published Sep 8, 2019, 4:24 PM IST

సాహో వచ్చి వారం దాటి పోయింది. మొదట భారీగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం టీమ్ ఆ తర్వాత హిందీ వెర్షన్ కు మంచి రెస్పాన్స్ రావటంతో కాస్త రిలాక్స్ ఫీలైంది. అయితే తమిళంలో, మళయాళంలో, ఓవర్ సీస్ లో డిజాస్టర్ అవటం, తెలుగులో సగానికి పైగా నష్టం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు సుజీత్ ...మీడియాకు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూని ఇప్పుడు అడ్డం పెట్టి డైరక్టర్ ని వెటకారం చేస్తున్నారు.
 
దర్శకుడు సుజీత్ ...లార్గో వించ్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ అస్సలు చూడలేదని అనటం కామెడీ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో అంత   350 కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు చెప్తుంటే మీరు నమ్మకపోతే ఎలా అంటూ బ్రహ్మానందం ఎక్సపెషన్ పెడుతున్నారు.  

అలాగే  "బాబూ ..నువ్వు లార్గో వించ్ చూడలేదు.. అందులోంచి ఒక్క సీన్ కూడా కాపీ కొట్టలేదు. మరి సినిమా నిండా  ఆ ఫ్రెంచ్ సినిమా సీన్లే ఎలా కనిపించాయి...వాళ్లే చాలా ఏళ్ల క్రితం నీ సినిమా నుంచి కాపీ కొట్టారేమో?," అని సుజీత్ ని డైరక్టర్ గా ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

అలాగే సాహోలో ఏదైనా అర్థంకాకపోతే మరోసారి చూడాలని మాటను కూడా కామెడీ చేస్తున్నారు. సుజిత్ ..క్రిటిక్స్ కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రివ్యూలు పోస్ట్ చేసే ముందు ఇంకాస్త వేచి చూస్తే బాగుండేదని, ఆక్యుపెన్సీని అది ప్రభావితం చేస్తుందని అంగీకరించాడు. దీన్ని హైలెట్ చేస్తున్నారు.

ఇక బీహార్ నుంచి తనకు చాలామంది కాల్స్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు.. బీహార్ లో పుట్టి ఉంటే సాహో సినిమా తీసినందుకు సుజీత్ కు వాళ్లు గుడికట్టి ఉండేవారని అన్నారు.దాంతో బాబూ నీ స్టాండర్డ్ బీహార్ కు సరిపోతుంది..అక్కడకు వెళ్లి సినిమాలు చేసుకో...గుళ్లు కట్టించుకో అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సుజీత్ ని మరీ అంతలా ఆడుకోవాల్సిన పని లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పెద్ద హీరోని డైరక్ట్ చేసేటప్పుడు రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. వాటిని తట్టుకుంటూ సినిమాని తడబడకుండా పూర్తి చేయాలి. అందులో చాలా భాగం చిన్న వయస్సు వాడైన సుజీత్ సక్సెస్ సాధించినట్లే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios