ఒక్కోసారి ఊహించని కామెడీలు సోషల్ మీడియాలో జరిగిపోతూంటాయి. అవి డైరక్టర్ మారుతి కామెడీ సినిమాల్లో జరిగే సీన్స్ లాగ కూడా ఉంటూంటాయి. తాజాగా దర్శకుడు మారుతి దాసరికి ట్విట్టర్‌లో ఫన్నీ ఎక్సపీరియన్స్ ఎదురైంది
ఒక్కోసారి ఊహించని కామెడీలు సోషల్ మీడియాలో జరిగిపోతూంటాయి. అవి డైరక్టర్ మారుతి కామెడీ సినిమాల్లో జరిగే సీన్స్ లాగ కూడా ఉంటూంటాయి. తాజాగా దర్శకుడు మారుతి దాసరికి ట్విట్టర్‌లో ఫన్నీ ఎక్సపీరియన్స్ ఎదురైంది. శరవణ కుమార్ అనే వ్యక్తి .. నా మారుతి స్విఫ్ట్ కారు ఇంజిన్ కాలిపోయింది. దీన్ని 2015 మేలో కొనుగోలు చేశా. బీమా ఉంది కానీ, కవరేజ్‌లో లేదు. దీంతో కారులోని భాగాలను మళ్లీ అమర్చడానికి రూ.1,80,000 అడిగారు. ఇంజన్‌కు కనీసం ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. కానీ, నా కారు విషయంలో మాత్రం వారెందుకు డబ్బులు అడుగుతున్నారు?’ అంటూ మారుతి కంపెనీకి ట్వీట్ చేయబోయి పొరపాటున దర్శకుడు మారుతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన మారుతి హుందాగా బదులిచ్చాడు. డియర్ సర్.. నేను సినిమా డైరెక్టర్ మారుతిని. నాకు మారుతి స్విఫ్ట్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఫిర్యాదు సరైన వారికి చేరుతుందని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. విషయం తెలుసుకున్న శరవణ సదరు ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన ట్విట్టర్ జనం ఊరుకుంటారా..మారుతి గారు అనబోయి మారుతి కారు అన్నాడని, మరొకటి అని ఫన్ చేయటం మొదలెట్టారు.
మరికొంత మంది అయితే ఈ విషయాన్ని ఓ కామెడీ ట్రాక్ గా చేసి మీ సినిమాలో పెట్టడంటూ సలహా ఇచ్చారు. వేరొకరు అయితే న్యూ ఇయిర్ భలే ఫన్నీగా ప్రారంభం అయ్యిందంటూ బదులిచ్చారు. ఏదైమైనా నవ్వొచ్చే విషయమే కదా.
అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా నాని హీరోగా రూపొందిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో పాపులర్ డైరెక్టర్‌గా మారిన దర్శకుడు మారుతి చివరిగా శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. ఇక ఆయన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
