అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నోరు జారిన విజయ్ దేవరకొండ సెన్సార్ బోర్డ్ కట్ చేసిన బూతులు థియేటర్లో ప్రేక్షకులే చెప్పాలట ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మా..ర్..చో... అంటూ మాట్లాడి అందరికీ షాకిచ్చిన విజయ్ 

పెళ్లి చూపులు సినిమాతో తెలుగులో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ. అయితే.. కథ పరంగా ఆ సినిమా ఎట్రాక్ట్ చేయడంతోనే జనాలు ఆ రేంజ్ హిట్ ఇచ్చారు. కానీ ఆ హిట్ తన ఖాతాలో వేసుకుంటూ తన స్థాయిని చాలా పెద్దగా ఊహించుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈవారం విడుదల కాబోతున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఓవరయ్యాయని, అంతొద్దు అంటూ ..ఈ యంగ్ హీరో పై ఘాటైన సెటైర్లు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమాలో బూతు పదాలు ఉన్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ముద్దు సీన్ తో వేసిన పోస్టర్ పై పలు రాజకీయ, మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రి రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ దుమారం రేగుతోంది. ఏదో యూట్యూబ్ కు సెన్సార్ ఉండదు కాబట్టి ఈసినిమా టీజర్ ను అప్ లోడ్ చేసినా ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. అయితే సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉంటుంది అన్న విషయం కూడ ఈయంగ్ హీరోకు తెలియదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

ఈమూవీలోని కొన్ని బూతు పదాలను సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం లేదు. థియేటర్లలో ఆ బూతు పదాల సీన్స్ వచ్చినప్పుడు తన బదులు ఆ డైలాగ్స్ ను ప్రేక్షకులను చెప్పమని అంటూ విజయ్ దేవరకొండ యూత్ ను రెచ్చగొట్టడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు తన సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ యంగ్ హీరోకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. ఈసినిమా కథ విన్నప్పుడే ఇది పిల్లల కథ కాదు అని తనకు అనిపించింది అని చెపుతున్న ఈ యంగ్ హీరో తన సినిమాలోని డైలాగ్స్ ను తొలిగించే అధికారం సెన్సార్ బోర్డ్ కు ఎక్కడ ఉంది అని అర్ధం వచ్చే విధంగా కామెంట్స్ చేస్తున్నాడు. 

ముఖ్యంగా “ఏం మాట్లాడుతున్నావ్ రా“ అనే డైలాగ్ దగ్గర చివర వచ్చే బూతు పదాన్ని మ్యూట్ చేయడం ఈ యంగ్ హీరోకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. దీనితో టాప్ యంగ్ హీరోలు అంతా తమ అభిమానులు సభ్యతగా సంస్కారంతో ఉండాలి అని స్పీచ్ లు ఇస్తూ ఉంటే పట్టుమని కనీసం 5 సినిమాలలో కూడా నటించని ఈ యంగ్ హీరో ఓవర్ యాక్షన్ ఏమిటి అంటూ చాలామంది అంటున్నారు. అయినా బూతు పదాలు పబ్లిక్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొందరు కేసులు వేసేందుకు కూాడా రెడీ అవుతున్నారు.