శ్రీరెడ్డి ‘ఆత్మ హత్య’ యత్నం వైరలవుతున్న న్యూస్

First Published 19, Apr 2018, 4:18 PM IST
Social media agog with news of srireddys attempt to suicide
Highlights

 శ్రీరెడ్డి  ‘ఆత్మ హత్య’ యత్నం

గత రెండు రోజులుగా పవన్ గొడవ పై నానా రచ్చ జరుగుతూనే ఉంది.  ఈ చర్చ మధ్య ఇపుడొక సన్సేషన్ వార్త వెలువడింది.  శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని వార్త  గురువారం ఉదయం గుప్పు మంది.  ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు  మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా లో అది వైరలయింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించినట్టు సమాచారం. ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి బయటకు చెప్పడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు అనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. కానీ ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె సన్నిహితులు, మిత్రులు అంటున్నారు.  ఆమె ఎపుడు,ఎలా ఎక్కడ ఆ అఘాయిత్యానికి పూనుకున్నారనే వివరాలు ఏవైపు నుంచి రావడం లేదు. ఆసుపత్రి ఏదో కూడా తెలియడం లేద. అయితే, వార్త మాత్రం తెగ ప్రచారమవుతూ ఉంది.  ఫీల్డో లోనే కాదు, సోషల్ మీడియా లో ఎప్పుడూ  యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి ఈ న్యూస్ ఇంత వైరల్ అవుతున్నా...ఎందుకు స్పందించట్లేదు అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే శ్రీరెడ్డి స్వయంగా ఏదయినా చెబితో తప్ప ఈ విషయం మీద  క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

loader