సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గా 'రాజసం' అనే పేరుని పరిశీలిస్తున్నట్లు పోస్టర్లు కూడా విడుదల చేశారు కొందరు ఔత్సాహికులు. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో క్లారిటీ వస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు రైతు సమస్యలను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. అమెరికా, ఇండియాలో కథ నడుస్తుందని.. ఇండియాలో ఎపిసోడ్స్ రైతు సమస్యల మీద చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథను దర్శకుడు ఏడాది కిందట అప్పటి పరిస్థుతులకు తగ్గట్లు రాసుకున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం రైతుల బాగుకోసం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. కాబట్టి తిరిగి సీన్లను మార్చి రాస్తాడా..? లేక సినిమాటిక్ లిబర్టీతో తన కథను తెరపై ఆవిష్కరిస్తాడా..? అనే విషయంలో స్పష్టత రావల్సివుంది.

గతంలో కూడా మహేష్ బాబు సామాజిక స్పృహ ఉన్న అంశాలను తన సినిమాలలో టచ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ తరహా కథలోనే నటించబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్ కూడా కనిపించబోతున్నారు.