'గూఢచారి' చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శోభితా ధూళిపాళ్ల మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ చిత్రాల్లో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం శోభితా ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది.ఇందులో ఆమె ముస్లిం యువతిగా నటిస్తోంది.

ఈ క్రమంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నేరుగా హోటల్ కి వెళ్లిన శోబితాకి చేదు అనుభవం ఎదురైంది. పాత్ర కోసం వేసుకున్న బుర్ఖాను తీయకుండానే  శోభితా హోటల్ కి వెళ్లిందట.

తన పేరు మీద రూమ్ బుక్ చేశారని, తాళాలు ఇవ్వాలని రిసెప్షన్ లో ఉన్న వ్యక్తిని అడిగితే ఆమె తనకు తాళం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా శోభితా  వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ.. ''షూటింగ్ వేసుకున్న దుస్తుల్లోనే హోటల్ కి వెళ్లాను. నేను నటిని అని రిసెప్షన్ లో ఉన్న ఎవరికి తెలియదు. ఆ సమయంలో నేను బుర్ఖాలో ఉన్నా.. నా బ్యాగ్ కి కాస్త దుమ్ము పట్టి ఉంది. అదనపు గది తాళాలు కూడా ఇవ్వలేదు. కానీ నేనేం అనకుండానే అక్కడ నుండి వెళ్లిపోయాను. అతనితో గొడవ పడాలని కూడా అనుకోలేదు. నేను తలచుకుంటే అతనితో సారీ చెప్పించుకునేదాన్ని. కానీ నా చుట్టూ ఎంతమంది ఉన్నా వారు మానవత్వం చూపించలేదు. నేను ముస్లిం అనుకొని కొద్దిసేపటి వరకు రిసెప్షనిస్ట్ నాతో ప్రవర్తించిన తీరుకే నేను ఇంతగా బాధపడుతుంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి'' అంటూ చెప్పుకొచ్చింది.