సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు అందుకోవడం చాలా ఈజీ. అయితే అలా వచ్చిన అవకాశాలతో గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. క్రేజ్ రావాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి. అయితే మంచి టాలెంట్ ఉన్నప్పటికీ చాలా మంది నటులు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు.

ఉదాహరణకు సందీప్ కిషన్ ని చెప్పుకోవచ్చు. మనోడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ రోజుల్లోనే వరుసగా అవకాశాలు అందుకోవడం స్టార్ట్ చేశాడు. మామయ్య చోటా కె నాయుడు సీనియర్ కెమెరామెన్ కావడంతో కోలీవుడ్ లో కూడా అవకాశాలు బాగానే అందాయి. ఇకపోతే గత ఏడాది వరకు ఎంతో బిజీగా ఉన్న సందీప్ ఇప్పుడు కొంచెం స్పీడ్ తగ్గించాడు. చేసిన సినిమాలు సందీప్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. కొన్ని సినిమాలు మాత్రం నటనతో ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్నాడు. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సివి కుమార్ నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక చోట కె నాయుడు గారే సినిమాటోగ్రఫీ అందించనుండగా జిబ్రాన్ సంగీతం సమకూర్చానున్నారు. మరి సందీప్ కిషన్ ఈసారైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.