Asianet News TeluguAsianet News Telugu

Nithyamenon: ‘స్కైలాబ్‌’ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..అఫీషియల్

పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో  వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్ ని మేకర్స్ ప్రకటించారు. 

Skylab Seals OTT Streaming Date
Author
hyderabad, First Published Jan 12, 2022, 1:14 PM IST

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో  వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్ ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీ లోకి అడుగుపెట్టనుంది. 

భారీ ధరకు స్కైలాబ్ సినిమా ను సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను హక్కులు దక్కించుకున్నారని సమాచారం.  ఇక ఈ సినిమాకు నిత్యామీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. మరి థియేటరర్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై   సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్‌ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్‌’కు డివైడ్ టాక్ వచ్చింది. 

చిత్రం కథేమిటంటే...
సినిమా 1979 లో జరగుతుంది. డాక్టర్ చదువుకున్న ఆనంద్ (స‌త్య‌దేవ్‌)కు డాక్టర్ లైసెన్స్ కాన్సిల్ అయ్యిపోతుంది. అతనికో ఐదు వేలు కావాలి. అందుకోసం తన తాతగారు ఊరైన  బండ లింగంప‌ల్లికి వస్తాడు. ఆ ఊరి దొరకూతురు గౌరి(నిత్యామీనన్) ఉద్యోగం ఊడిపోతే తన ఊరు వస్తుంది. ఆమెకు పెద్ద జర్నలిస్ట్ గా తన పేరు చూసుకోవాలనే కోరిక. లేకపోతే తన తండ్రి పెళ్లి చేసేస్తాడని భయం. మరో ప్రక్క సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌)ది కూడా అదే ఊరు. ఒకప్పుడు బాగా వెలిగిన ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఆస్ది తగాదాలు,కోర్టు కేసులు మిగిలాయి. దాంతో ఊరినిండా అప్పులు చేస్తాడు. ఆ అప్పుల నుంచి బయిటపడి తన చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇలా ఎవరి గొడవలో వారు ఉండగా...ఈ లోగా అదే ఊళ్లో  స్కైలాబ్ పడబోతోందని వార్త వస్తుంది. దాంతో ఊరు నాశనం అయ్యిపోతుందని ప్రచారం జరుగుతుంది. అప్పుడు వారు ఎలా స్పందించారు. తమ లక్ష్యాలు ఎలా సాధించుకున్నారు. స్కైలాబ్ ని తమ స్వాలాభం కోసం ఎలా వాడుకుందామనుకున్నారు ..చివరకి ఏమైందనేది మిగతా కథ. 

 

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు హీరో సత్యదేవ్. సత్యదేవ్ హీరోగా చేయటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  స్కై ల్యాబ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. 
 
 ‘‘1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం నాశనమై పోతుందని వార్తలొచ్చాయి. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైల్యాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఈ చిత్ర కథాంశం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది.
 

Follow Us:
Download App:
  • android
  • ios