వెనక్కి తగ్గిన రామ్ పోతినేని.. `సలార్` డేట్‌కి `స్కంద`.. ఈ ఊగిసలాట ఏంటో?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న `స్కంద` మూవీ మరోసారి రిలీజ్ డేట్ ని మార్చుకుంది. వెనక్కి ముందుకు వెళ్తూ ఆడియెన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది.

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న `స్కంద` మూవీ రిలీజ్ డేట్ లు వరుసగా మార్చుకుంటుంది. ముందుకు వెనక్కి ఊగిసలాడుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదట దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే డేట్‌కి బాలయ్య `భగవంత్ కేసరి` విడుదలవుతుంది. దీంతో పోటీ ఎందుకని వెనక్కి తగ్గారు. బాలయ్యకి, బోయపాటికి మధ్య ఉన్న మంచి ర్యాపో కారణంగా బోయపాటి వెనక్కి తగ్గారు.
నెల రోజుల ముందుగానే రిలీజ్‌కి సిద్ధమయ్యారు. దీంతో సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలనుకున్నారు. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేశారు. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ట్రైలర్ కూడా వచ్చింది. రిలీజ్‌కి ఇంకా వారం రోజులే ఉంది. సడెన్‌గా మళ్లీ రిలీజ్ డేట్ మార్చేశారు. దాదాపు 13 రోజులు వెనక్కి వెళ్లారు.
`సలార్` డేట్‌కి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ప్రభాస్ నటించిన `సలార్` చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలనుకున్న విషయం తెలిసిందే. కానీ సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాని వాయిదా వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ, టీమ్ నుంచి హింట్ మాత్రం వచ్చేసింది. దీంతో వరుసగా `సలార్` డేట్‌ని ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే `రూల్స్ రంజాన్`, `పెదకాపు 1`, `మ్యాడ్` చిత్రాలు సెప్టెంబర్ 28న విడుదల తేదీలు ప్రకటించాయి. తాజాగా వాటిపైకి `స్కంద`ని వదలబోతున్నారు.
నిజానికి సెప్టెంబర్ 15న మంచి డేటే. తెలుగులో సినిమాలేవి లేవు. తమిళ చిత్రాలు `స్కంద`, `మార్క్ ఆంటోని` ఉన్నాయి. తమిళ చిత్రాల ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి, `స్కంద`కి ఎదురే లేదు. కానీ అనూహ్యంగా రిలీజ్ డేట్ మార్చడం ఆశ్చర్య పరుస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ డేట్‌కి వచ్చిన రచ్చ చేస్తుందని, మ్యాటర్ లేకపోవడం వల్లే ఇలా ముందుకి, వెనక్కి ఊగిసలాడుతుంటాయని అంటున్నారు నెటిజన్లు. అయితే `స్కంద`పై కొంత నెగటివ్ టాక్ ఉంది. బిజినెస్ కూడా ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్‌లో జరగలేదంటున్నారు. ఔట్ పుట్ ఆశించిన రేంజ్‌లో రాలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే బోయపాటి వెనక్కి, ముందుకు ఊగిసలాడుతున్నారని అంటున్నారు.
`అఖండ` అలాంటి సూపర్ హిట్ తర్వాత బోయపాటి నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ టీమ్ రిలీజ్ డేట్‌పై ఇంత గందరగోళంగా వ్యవహరించడంతో నిజంగానే ఏదో తేడా ఉందనే అనుమానాలు ఆడియెన్స్ లో కలుగుతున్నాయి. అందుకు టీమే కారణం కావడం విచారకరం. ఇక రామ్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.