సారాంశం
ఆదివారం జోరు చూపించిన స్కంద హాలిడే అయినప్పటికీ సోమవారం నెమ్మదించింది. వసూళ్లు భారీగా పడిపోయాయి.
హైప్ నేపథ్యంలో స్కంద చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ దక్కింది. ఏకంగా వరుసగా ఐదు సెలవు దినాల్లో స్కంద విడుదల కాగా చాలా వరకు మేలు జరిగింది. లేదంటే ఈ చిత్రం భారీ నష్టాలు చవి చూసేది. ఐదవ రోజు స్కంద వసూళ్లు పరిశీలిస్తే...
ఏపీ/తెలంగాణాలలో ఫస్ట్ డే స్కంద రూ. 8.52 కోట్లు, సెకండ్ డే రూ. 3.50 కోట్లు, థర్డ్ డే రూ.3.27 కోట్లు వసూలు చేసింది. అయితే ఆదివారం స్కంద వసూళ్లు పెరగడం కలిసొచ్చే అంశం. స్కంద నాలుగో రోజు రూ.4.46 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు స్కంద రూ.19.85 కోట్ల షేర్, 32.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 23.40 కోట్ల షేర్, 39.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఐదవ రోజు స్కందకు నైజాంలో కోటి కంటే తక్కువ షేర్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 కోట్ల వరకూ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ చూస్తే రూ. 3 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కంద ఐదు రోజుల కలెక్షన్స్ రూ. 22 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఇక వరల్డ్ వైడ్ రూ. 25 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
స్కంద చిత్రం దాదాపు రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రామ్ హిట్టు కొట్టి చానళ్ళు అవుతున్నా బోయపాటి శ్రీనుపై నమ్మకంతో బిజినెస్ జరిగింది. రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన స్కంద రాబట్టాల్సిన వసూళ్లు చాలా ఉన్నాయి. మరో రూ. 22 కోట్ల వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ తెచ్చుకోవడం కష్టమే అని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో వసూళ్లను బట్టి చిత్ర ఫలితం తెలుస్తుంది. స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. సాంగ్స్, బీజీఎం విషయంలో థమన్ ఫెయిల్ అయ్యాడన్న మాట వినిపిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.