Asianet News TeluguAsianet News Telugu

ఏఆర్‌ మురుగదాస్‌ నెక్ట్స్ చిత్రం ఖరారు, హీరో ఎవరంటే..

 మురుగదాస్ వరుసగా పరాజయాలు చవిచూశారు. ‘దర్బార్’ డిజాస్టర్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

Sivakarthikeyan to join hands with director A R Murugadoss?
Author
First Published Jan 24, 2023, 11:22 AM IST


ఎన్నో ఎక్సపెక్టేషన్స్ చేసిన సినిమా డిజాస్టర్ అయితే ఆ దర్శకుడు,లేదా హీరో కొంతకాలం వెనకబడటం ఖాయం. అదే స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కు జరిగింది. ఆయన రజినీకాంత్‌తో చేసిన దర్బార్‌ చిత్రం తీవ్రంగా నిరాశపరచింది. దీంతో ఆయనకు ఆఫర్స్  సన్నగిల్లాయి. ఆయన కూడా పూర్తి స్దాయి నమ్మకం కలిగాకే సినిమా మొదలెడదామని గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో స్టోరీలైన్స్ అనుకుని హీరోలను కలుస్తున్నారు.  ఆ మధ్య విజయ్‌ హీరోగా చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్‌ ఆయనకు చాన్స్‌ ఇవ్వలేదు. అలాగే తెలుగులో ఒకరిద్దరు హీరోలతో  చిత్రాలు చేయన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవి ముందుకు వెళ్లలేదు.

ఈనేపథ్యంలో మురుగదాస్‌ తదుపరి చిత్రం ఏమిటనేది..? సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈయన బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలతో చిత్రం చేయబోతున్నట్లు వచ్చాయి.  సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్‌ హీరోలుగా హిందీలో మల్టీస్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరిగింది. 1995లో కరణ్‌ అర్జున్‌ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. అయితే పూర్తిస్థాయి చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మురుగదాస్‌ చిత్రంపై అంచనాలు పెరిగాయి. కానీ అదీ ముందుకు వెళ్లలేదు. ఈ క్రమంలో ఓ ప్రాజెక్టు కన్ఫర్మ్ గా సెట్ అయ్యిందనన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు శివ కార్తికేయన్.

ఈ సినిమాను లైట్‌ హౌస్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, శివకార్తికేయన్ ప్రస్తుతం ‘అయిలాన్‌‘ చిత్రాన్ని పూరి చేసి ‘మావీరన్‌‘ అనే సినిమాలో నటిస్తున్నారు. 

మురగదాస్ ..తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ‘దీనా’, ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. సూర్యతో ‘గజిని’ మూవీని చేసిన మురుగదాస్, అదే సినిమాను హిందీలో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. దళపతి విజయ్ తో ‘తుపాకి’ చిత్రాన్ని తీసి మళ్ళీ అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’గా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మురుగదాస్ వరుసగా పరాజయాలు చవిచూశారు.శివకార్తికేయన్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వస్తానని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios