Asianet News TeluguAsianet News Telugu

`రోబో`ని మించిన వీఎఫ్‌ఎక్స్ తో `అయలాన్‌`.. అసలు విషయం బయటపెట్టిన శివకార్తికేయన్‌..

శివ కార్తికేయన్‌ నెమ్మదిగా తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు `అయలాన్‌` చిత్రంతో వస్తున్నారు. దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

sivakarthikeyan revealed that ayalaan have huge vfx its more than robo 2.0 arj
Author
First Published Jan 25, 2024, 7:38 AM IST

శివ కార్తికేయన్‌ తెలుగుపై ఫోకస్‌ పెట్టాడు. ఆయన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నాడు. ఆయన నటించిన `డాక్టర్` మూవీ మంచి ఆదరణ పొందింది. దీంతోపాటు `రెమో`, `డాన్‌` చిత్రాలు కూడా ఫర్వాలేదనిపించాయి. కానీ `జాతిరత్నాలు` ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో స్ట్రెయిట్‌గా తెలుగులో `ప్రిన్స్` అనే మూవీ చేశాడు. ఇది నిరాశ పరిచింది. ఇప్పుడు `అయలాన్‌`తో వస్తున్నారు. ఏలియన్‌, మనిషి కలిస్తే ఎలా ఉంటుంది, మనిషితో ఎలియన్‌ ఎలా కలిసిపోయిందనే కాన్సెప్ట్ ఈ మూవీ తెరకెక్కింది. 

సైన్స్ ఫిక్షన్‌ గా రూపొందించిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. రెహ్మాన్‌ సంగీతం అందించడం విశేషం. తమిళంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్‌రెడ్డి ఈ మూవీని తెలుగులో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో తెలుగు ఆడియెన్స్ ని కలిసేందుకు వచ్చారు శివ కార్తికేయన్‌. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఆసక్తి కర విషయాలను బయటపెట్టాడు. 

`అయలాన్‌` సినిమాలో ఇద్దరు హీరోలుంటారని తెలిపారు. తనతోపాటు ఏలియన్ కూడా హీరోనే అని, 70శాతం సినిమాలో ఏలియన్‌ పాత్ర ఉంటుందన్నారు. అయితే ఇందులో `రోబో`, `2.0`ని మించిన వీఎఫ్‌ఎక్స్ ఉంటాయట. సినిమాలో దాదాపు 90శాతం వీఎఫ్‌ఎక్స్ ఉంటాయట. నిజానికిఇలాంటి సినిమా చేయాలంటే భారీ బడ్జెట్ కావాలని, రెండు మూడు వందలకోట్లు అవుతుందని, కానీ తాము చాలా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ టైమ్‌ తీసుకుని చేసినట్టు తెలిపారు. క్వాలిటీ కోసం లేట్‌ అయ్యిందని చెప్పారు. కచ్చితంగా ప్లాన్‌ చేస్తే తక్కువ బడ్జెట్‌లో అద్భుతాలు చేయోచ్చని వెల్లడించారు శివ కార్తికేయన్. 

eయన ఇంకా చెబుతూ, `ఇది ఫాంటసీ సూపర్ హీరో ఫిలిం కాబట్టి కొన్ని కొన్ని సన్నివేశాలు మనం ముందు తీసినప్పటికీ, తర్వాత విడుదలైన కొన్ని సినిమాల్లో ఉండొచ్చు. ఏలియన్ - మనిషి మధ్య సన్నివేశాలు, వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, అయలాన్ కోర్ పాయింట్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదు. మా స్క్రిప్ట్ ఐడియా ఇప్పటికీ కొత్తగా ఉంది. ఒకవేళ మా దర్శకుడు ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తే స్క్రీన్ ప్లే మార్పులు ఏమైనా చేస్తాడేమో. తమిళనాడులో సినిమా చూసిన వాళ్ళు ఎవరు కథపై కంప్లైంట్స్ చేయలేదు. చాలా కొత్తగా ఉందని చెప్పారు. అది మా అదృష్టం. యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. హ్యూమన్ ఏలియన్ మధ్య ఇంటరాక్షన్ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. కంటెంట్‌ బాగుంటే ఎప్పుడైనా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకుంది` అని తెలిపారు. 

అలాగే ఏఆర్‌ రెహ్మన్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందన్నారు శివ కార్తికేయన్‌. 'అయలాన్' సినిమాలా ఉండదు... మీరు థీమ్ పార్క్ లోకి వెళ్లినట్టు ఉంటుంది. జాలీ రైడ్ కింద ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్‌ చేసేలా ఉంటుందన్నారు. నెక్ట్స్ కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌. 80 శాతం షూటింగ్‌ పూర్తయ్యిందట. సమ్మర్లో విడుదల చేస్తామని తెలిపారు. 

Read more: ఫ్యామిలీతో కలిసి ప్రఖ్యాత దేవాలయంలో తమన్నా పూజలు.. మేకప్‌ లేకుండా కూడా ఆపిల్‌ పండులా మెరిసిపోతుందిగా!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios