Asianet News TeluguAsianet News Telugu

కామెడీ ఫిల్మ్ ‘వరుణ్ డాక్టర్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘వరుణ్‌ డాక్టర్‌’ ఆ అంచ‌నాల్ని అందుకుని భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు. బాగా కలెక్ట్ చేసాడు. అయితే అందరూ థియోటర్ కు వెళ్లి చూడరు. కాబట్టి ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
 

Sivakarthikeyan Doctor Locks OTT Release Date
Author
Hyderabad, First Published Oct 26, 2021, 7:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలుగు సినీ పరిశ్రమలో ద‌స‌రా జోష్ క‌నిపించింది. ప్రేక్షకుల‌కు పండ‌గ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు తెలుగు చిత్రాల‌న్నీ ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ ముందుకు వ‌రుస క‌ట్టాయి. ఈ రేసులో ‘వరుణ్‌ డాక్టర్‌’ అనే ఓ డబ్బింగ్ చిత్రమూ లక్ ప‌రీక్షించుకునేందుకు వచ్చింది. త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ న‌టించిన చిత్రమిది. నెల్సన్‌ దిలీప్ కుమార్ తెర‌కెక్కించారు.  ‘రెమో’, ‘శ‌క్తి’వంటి సక్సెస్ ఫుల్  చిత్రాల త‌ర్వాత కార్తికేయ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం.. దీనికి తోడు ట్రైలర్స్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో ప్రేక్షకుల్లోనూ అంచ‌నాలేర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ‘వరుణ్‌ డాక్టర్‌’ ఆ అంచ‌నాల్ని అందుకుని భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు. బాగా కలెక్ట్ చేసాడు. అయితే అందరూ థియోటర్ కు వెళ్లి చూడరు. కాబట్టి ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు  ‘వరుణ్‌ డాక్టర్‌’ చిత్రం ఈ చిత్రం నవంబర్ 5 ఓటీటిలో రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రీమియర్ జరగనుంది. సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు అవుతూండటంతో ఓటీటి రిలీజ్ ఇచ్చారని తెలుస్తోంది. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో శివ కార్తికేయన్ ఒకరుగా కనిపిస్తాడు. కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. శివ కార్తికేయన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. శివ కార్తికేయన్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ నెల 9వ తేదీన విడుదల చేసారు.
  Also read నామినేషన్స్ కి భయపడేంత సీన్ లేదు..శ్రీరామ్ మాస్, షణ్ముఖ్ తల్లి గురించి సంచలన నిజం

చిత్రం కథేమిటంటే...వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్ కు, తనకు పొసగదనే విషయం గ్రహించిన పద్మిని పెళ్ళికి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది. అదే సమయంలో ఆమె అన్నయ్య కూతురు కిడ్నాప్ కు గురౌతుంది. పద్మినితో బ్రేక్ అప్ అయినా ఆ పాపను రక్షించడానికి ఈ ఆర్మీ డాక్టర్ ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ.  స్కూల్ లో చదువుకునే పాపను కొందరు కిడ్నాప్ చేయడం, ఆ చిన్నారిని వెతుక్కుంటూ ఇంటి సభ్యులంతా డాక్టర్ వరుణ్ ప్లాన్ ప్రకారం గోవాకు వెళ్ళడం, అక్కడ విలన్ తో తలపడటం అంతా ఓ హై డ్రామాను తలపిస్తుంది. దీనికి తోడు ప్రతి సీన్ నూ దర్శకుడు వినోదానికి ప్రాధాన్యమిచ్చాడు. కొన్ని చోట్ల సిట్యుయేషనల్ కామెడీని, మరికొన్ని చోట్ల డైలాగ్ కామెడీని ఆశ్రయించాడు.

Also read బస్సు డ్రైవర్ పై రజనీ కామెంట్స్.. మాసిన చొక్కా, ఆ గతి కూడా లేదు.. డైలాగులు కాదు అక్షర సత్యాలు 

 ఆర్మీ డాక్టర్ గా శివ కార్తికేయన్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. సినిమాలో మంచి సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాల చోట్ల కొంత స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios