Asianet News TeluguAsianet News Telugu

Don on OTT:'డాన్' ఓటిటి రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్టనర్

  శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

Sivakarthikeyan college drama Don on OTT: Streaming Partner & Date
Author
Chennai, First Published May 16, 2022, 10:15 AM IST


ఈవారంలో అందరీ దృష్టీ మహేష్ హీరోగా వచ్చిన సర్కారు వారి పాట చిత్రంపై ఉంది. అయితే ఆ తర్వాత రోజు రిలీజైన శివకార్తికేయన్ చిత్రం డాన్ ని పట్టించుకున్న వాళ్లు లేరు. అయితే ఈ చిత్రం చాలా  బాగుందని చూసినవాళ్లు చెప్తున్నారు. తమిళంలో అయితే మంచి హిట్ టాక్ తో హౌస్ ఫుల్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. వాస్తవానికి   శివ కార్తికేయన్(Siva karthikeyan) రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత శివ కార్తికేయన్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. చివరగా శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.  మే 13 విడుదలైన శివ కార్తికేయన్ ‘డాన్'(Don) చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి  ఎప్పుడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డాన్ చిత్రం నెట్  ప్లిక్స్ వారు రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రం జూన్ ఫస్ట్ వీక్ లో ఓటిటిలో రిలీజ్ కానుంది.  ఇక ఈ చిత్రం కథ ఏమిటంటే..
 
 చక్రవర్తి (శివకార్తికేయన్)కి చిన్నతనం నుంచే తండ్రి  (సముతిర ఖని) క్రమశిక్షణ అంటే పడదు. తన తండ్రి ఓ నిఖాసైన విలన్ అంటూంటాడు. తన అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వడని భావిస్తూంటాడు. దానికి తోడు చక్రవర్తికి చదవు అంటే పెద్దగా ఎక్కదు. తనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకుని దాంట్లో నైపుణ్యం సంపాదించాలని కలలు కంటూంటాడు. ఆ క్రమంలో  పెరిగి పెద్దై తండ్రి బలవంతంపై బీటెక్ కాలేజీలో చేరతాడు. అక్కడ  కాలేజీలో ప్రొఫెసర్, కాలేజీ డిసిప్లిన్ కమిటీ హెడ్  భూమినాథం (ఎస్.జె. సూర్య) పెట్టె రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అతడిని భవపెడతాయి. దాంతో   చక్రవర్తి ఓ  ప్లాన్ వేసి  భూమినాథం కాలేజీ నుంచి వెళ్లగొడతాడు. ఆ తర్వాత చాలా స్వేచ్చగా ఉంటాడు. దాంతో దాంతో చక్రవర్తిని కాలేజీ స్టూడెంట్స్ అంతా డాన్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు.  ఇక డాన్  చదువు ఎక్కదు. కానీ, తండ్రి (సముద్రఖని) దగ్గర 80 శాతం మార్కులు వచ్చాయని చెప్పుకొంటాడు. యేడాదికేడాదికి బ్యాక్ లాగ్స్ పెరుగుతున్నా, తండ్రికి మాత్రం పాస్ అయినట్టుగా అబద్ధం చెబుతుంటాడు.

మరో ప్రక్క డాన్ కో ఓ లవ్ స్టోరీ. అదీ అతను స్కూల్ డేస్ నుంచి నడుస్తూంటుంది. తను  ప్రేమించిన అమ్మాయి ఆకాశవాణి (ప్రియాంకా అరుల్ మోహన్) కూడా తన కాలేజీలో చేరుతుంది. అయితే ఆమె అతన్ని పట్టించుకోదు.. ఈ లోగా కాలేజీ నుంచి బయిటకు వెళ్లిన   భూమినాథం రెండు నెలల్లో తిరిగొస్తాడు. తనను కాలేజీ నుంచి తరిమేసిందని  డాన్ అని తెలుసుకుని అతనిపై రివేంజ్ తీర్చుకునే పోగ్రామ్ పెట్టి మరింత స్ట్రిక్ట్ గా చేస్తాడు. దాంతో డాన్ మరో ఎత్తు వేసి లెక్చరర్స్, ప్రొపెసర్స్ ని మరింత ఏడ్పించే పోగ్రాం పెట్టుకుంటాడు. అప్పుడు భూమినాథం...డాన్ తండ్రికి కబురు పంపుతాడు. ఆయన కాలేజీ కు వచ్చే సమయానికి భూమినాధం ను అక్కడ లేకుండా చేసి మరో గేమ్ ఆడి,తప్పించుకుంటాడు. ఇలా పిల్లా, ఎలుకా ఆట ఇద్దరి మధ్యా జరుగుతుంది.  ఈక్రమంలో తను సినిమా డైరక్టర్ అయితే బెస్ట్ అని డాన్ అర్దం చేసుకుని, ఓ షార్ట్  ఫిలమ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. 

ఇది తెలిసిన భూమినాథన్ అడ్డుపడతాడు.ఈ సారి డాన్ తండ్రికి తెలిసిపోతుంది. చివరకు కాలేజీలో షూటింగ్ పెడితే అక్కడ అనుకోని సంఘటనతో భూమినాథన్ గాయపడతాడు. డాన్ ని కాలేజీనుంచి పంపేస్తాడు. చివరకు అన్ని అడ్డంకులు దాటుకుని డాన్ సినిమా డైరక్టర్ గా సక్సెస్ అయ్యి..అదే కాలేజీ పంక్షన్ కు గెస్ట్ గా వస్తాడు. ఈ  ప్రాసెస్ లో తన తండ్రిని కోల్పోతాడు. ఆయన చనిపోయాక డాన్ కు అర్దమవుతుంది. తన తండ్రి విలువ. అలాగే భూమినాధం కూడా అంత స్ట్రిక్ట్ గా స్టూడెంట్స్ తో ఉండకూడదని తెలుసుకుంటాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios