కోలీవుడ్ లో నేచురల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు శివకార్తికేయన్. తెలుగులో కూడా రెమో సినిమాతో మంచి ఇమేజ్ సాధించాడు. ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది యంగ్ స్టార్ కు. ఇక తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు శివ

తమిళ హీరో శివకార్తికేయన్ అటు తమిళనాడులో.. ఇటు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. చాలా కాలంగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలి అనుకుంటున్నాడు శివ. ఇక ఎప్పటి నుంచో శివకార్తికేయన్ తెలుగు సినిమా ఎంట్రీపై రూమర్స్ వినిపితూనే ఉన్నాయి. ఇక ఆయన నటిస్తున్నతొలి తెలుగు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
జాతిరత్నాలు సినిమాతో దడదడలాడించిన యంగ్ స్టార్ అనుదీప్ దర్శకత్వం తో శివకార్తికేయన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది.
హీరోయిన్ సహా ఇతర అంశాలపై ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మూవీ మేకర్స్ వీటిపై త్వరలోనే స్పష్టత రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే శివకార్తికేయన్ కూడా పాన్ ఇండియాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.