Asianet News TeluguAsianet News Telugu

రాంచరణ్ "మెరుపు" కథ మొత్తం చెప్పేశాడు..ఫుట్ బాల్ నేపథ్యంలో అంట!

  • రాంచరణ్ మెరుపు కథ మొత్తం చెప్పేశాడు
  • మెరుపు చిత్రం ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతుంది అని శివ కార్తీక్ తెలిపాడు.
  • తనని ఆ చిత్రంలో చరణ్ ఫ్రెండ్ పాత్రలో ఎంపిక చేసుకున్నారు
sivakarthik sensational comments on ramcharan movie

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న శివ కార్తీక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శివ కార్తీక్ లజ్జ చిత్రంలో హీరోగా కూడా నటించాడు. కానీ ఈ నటుడికి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాలు కరువయ్యాయి. రాంచరణ్ సినిమాలో అవకావం దక్కినట్లే దక్కి చేజారిపోయిందని ఈ నటుడు తన ఆవేదనని ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. శివ కార్తీక్ కామెంట్స్ చేసింది ప్రారంభమై ఆగిపోయిన చెర్రీ చిత్రం మెరుపు గురించే.

మగధీర చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్న రాంచరణ్ ఆ తర్వాత ఆరెంజ్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే చరణ్ మెరుపు అనే మరో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

శివకార్తీక్ మాట్లాడుతూ తాను ఆ సమయంలో తాను ఆ సమయంలో భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నటిస్తున్నానని తెలిపాడు. మెరుపు చిత్ర దర్శకులు ధరణి తనని ఆ చిత్రంలో చరణ్ ఫ్రెండ్ పాత్రలో ఎంపిక చేసుకున్నారు.మెరుపు చిత్రం ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతుంది అని శివ కార్తీక్ తెలిపాడు. అవకాశం దక్కడంతో చాలా సంబర పడ్డానని శివకార్తీక్ వెల్లడించాడు.షూటింగ్ ప్రారంభానికి ముందురోజు తనకు సంతోషంతో నిద్ర పట్టలేదు అని శివకార్తీక్ తెలిపాడు.

హీరో ఫ్రెండ్ గా, గోల్ కీపర్ గా నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ పాత్రలో రాణించి మంచి గుర్తింపు పొందాలని కలలు కన్నట్లు శివకార్తీక్ తెలిపాడు.మొదటి రోజు షూటింగ్ సరదాగా సాగింది.సూపర్ గుడ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్, ధరణి వంటి డైరెక్టర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ సినిమా కావడంతో చాలా ఆనందపడ్డానని శివ కార్తీక్ తెలిపాడు.

కానీ అనుకోని కారణాల వలన మెరుపు చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీనితో చాలా నిరాశ పడ్డానని శివ కార్తీక్ తెలిపాడు.ఆ చిత్రం ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే తేరుకుని కొత్త అవకాశాలకోసం ప్రయత్నించా అని శివకార్తీక్ తెలిపాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios