ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను... అందుకే నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం: శివాజీ రాజా

First Published 9, Mar 2018, 10:37 AM IST
Sivajiraja about his accident
Highlights
  • శివాజిరాజ ఇప్పడు పెద్ద ఫాంలో లేడు కాని ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్
  • నేను రామచంద్రాపురం నుండి హైదరాబాద్ నా కారులో ప్రయాణిస్తున్నాను​
  • డ్రైవర్ నేను వస్తున్నాం సిటీ మధ్యలో వచ్చాక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది​

శివాజిరాజ ఇప్పడు పెద్ద ఫాంలో లేడు కాని ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్. ఈ మధ్య ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చప్పుకొచ్చారు. చాలా యేళ్ల క్రితం అమృతం సీరియల్ చేస్తున్న సమయంలో గేట్ ముందు ఒక అతను సైగ చేస్తు నన్ను పిలిచాడు పక్కనే ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. నా దగ్గరకి వచ్చి మా అబ్బాయికి గుండె ఆపరేషన్ చేయాలి 35,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. నాకు ఎందుకో అతని మాటలు నమ్మసఖ్యంగా ఉండి అతనికి ఆ డబ్బును సర్దాను. అప్పటికే నా సన్నిహితులు సహఆర్టిస్టులు అందరు ఎవరికి పడితే వాళ్లకి డబ్బులు ఇస్తే ఎలా అని చాలా చెప్పారు. కానీ అప్పుడు నాకు అది జెన్యూన్ అని అనిపించింది ఇచ్చాను అంతే అన్నాను. కానీ ఎన్నీ రోజులు అతను కనిపించలేదు సరేకానీలే అనుకున్న. ఒకసారి నేను రామచంద్రాపురం నుండి హైదరాబాద్ నా కారులో ప్రయాణిస్తున్నాను. నా డ్రైవర్ నేను వస్తున్నాం సిటీ మధ్యలో వచ్చాక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. నేను అప్పుడు 15 రోజులు కోమా లో వెళ్లాను. అప్పుడు అతను నాకోసం ఎవరో మాటలు ద్వారా చెప్తే అతను నేనున్న హస్పిటెల్ కి వచ్చి నాకు కిడ్ని ఇవ్వడానికి 15 రోజులు తిరిగాడు. ఆ సంఘటన ఇంక నా కళ్ల ముందే ఉంది. అతను తెలంగాణలో ఒక గూడెంలో నివసిస్తాడు. అందుకే నాకు తెలంగాన వాళ్లంటే అంత ఇష్టం.

 

                                                                    

 

loader