నటుడు, బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ భార్య మధుమిత మధుమితకు అసభ్య ఈ మెయిల్స్ పంపించిన ఆవారా గాడు ఐపి అడ్రస్ గుర్తించిన పోలీసులు, నిందితున్న పట్టుకుంటామని హామీ

బిగ్ బాస్ సీజన్ వన్ విజేత, నటుడు శివబాలాజీ భార్య మధుమిత (స్వప్న మాధురి)కి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి శివబాలాజీ భార్యకు ఈమెయిల్ ద్వారా అసభ్య సందేశాలు వచ్చాయి. దీనిపై శివ బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక శివబాలాజీపై ట్రోలింగ్ బాగా అలవాటైపోయింది. గతంలోనూ శివబాలాజీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాటమరాయుడు షూటింగ్ సందర్భంలో ఓ వ్యక్తి శివబాలాజీపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాటమరాయుడు సమయంలో సకాలంలో కాటమరాయుడు చిత్రం రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం అంటూ 2017లో సినిమా రిలీజ్‌కు ముందు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. దానిపై ఓ వ్యక్తి బూతు కామెంట్ పెట్టాడు. దానిపై శివబాలాజీ తీవ్రంగా స్పందించాడు.

తాజాగా శివబాలాజీ భార్య స్వప్న మాధురికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. మధుమితకు ఈ-మెయిల్ ద్వారా ఓ వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపినట్టు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీని ఐపీ అడ్రస్‌ ద్వారా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే నిందితుడిని పట్టుకొంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.