సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం "దోచేవారెవరురా" ఈ సినిమా ద్వారా ప్రణవచంద్ర, ప్రణతి నూతనంగా వెండితెరపై పరిచయమౌతున్నారు. మాళవిక సతీషన్, అజయ్ గోష్, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
“వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, ఓపనై పోతుంది బాబూ…, హ్యాండ్సప్” వంటి వరస కామెడీలతో వైవిధ్యమైన కథలతో శివనాగశ్వరరావు జనాన్ని అలరించారు. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫోటో, భూకైలాస్” బాగున్నాయనిపించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన నవ్వించటానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు తన కొత్త చిత్రం ట్రైలర్ సైతం వదిలారు. ఈ ట్రైలర్ ఇప్పుడు అందరిని నవ్విస్తూ...సినిమా చూడాలనే ఆసక్తి కలగచేస్తోంది. వివరాల్లోకి వెళితే..
IQ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ అజయ్ గోష్. బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం “దోచేవారెవరురా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11. న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా.. నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్ లు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలియజేశారు.
దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ప్రతి హీరో లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ లో ఒక హీరో ఉంటాడు. అయితే వీరిలోని వారు , వారి లోని వీరు బయటకు రాకూడదు అని ఒక సందర్భంలో చెప్పారు. అలాగే చాలా మంది సినిమాను సెలెక్ట్ చేసుకున్నాం అంటారు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్నవాడిని సినిమానే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప సినిమాను మనం సెలెక్ట్ చేసుకోము .శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు.మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
శివ నాగేశ్వరావు మాట్లాడుతూ.. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగిందన్నాడు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని వెల్లడించాడు.
నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ.. శివ నాగేశ్వరరావు సినిమాలలో ఉన్న కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.ఇప్పుడు మంచి కాన్సెప్ట్ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "దోచేవారెవరురా" సినిమాలో కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నానని, మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు.
