మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం వంటి హిలేరియస్ సినిమాల ద్వారా శివ నాగేశ్వరావు తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ జనరేషన్ ని మెప్పించలేననుకున్నారో ఏమో కానీ కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన లేదు..మళ్లీ ఈ జనరేషన్ కు నా కామెడీ సినిమాలు చూపించాల్సిందే..నవ్వించాల్సిందే అని ఫిక్సైనట్లున్నారు.
కామెడీ సినిమాలు తీసేవాళ్లు చాలా మంది ఉంటారు కానీ నిజంగానే తెరపై ఫన్ చేసి నవ్వించే దర్శకులు అతి తక్కువ మంది ఉంటారు. ఈ జనరేషన్ లో ఆ తరహా డైరక్టర్స్ మరీ తక్కువైపోయారు. ఎంతసేపూ క్రైమ్, థ్రిల్లర్, హారర్ అంటూ వరస పెట్టి సినిమాలు వదులుతున్నారే కానీ మనసారా నవ్వుకునే సినిమాలు తీయటం లేదు. ఆ లోటు ని తీరుద్దామనుకుంటున్నట్లున్నారు దర్శకుడు శివ నాగేశ్వరరావు.
మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం వంటి హిలేరియస్ సినిమాల ద్వారా శివ నాగేశ్వరావు తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ జనరేషన్ ని మెప్పించలేననుకున్నారో ఏమో కానీ కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన లేదు..మళ్లీ ఈ జనరేషన్ కు నా కామెడీ సినిమాలు చూపించాల్సిందే..నవ్వించాల్సిందే అని ఫిక్సైనట్లున్నారు. ఇంతకాలానికి మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని 'దోచేవారెవరురా' టైటిల్ తో ఒక సినిమా రెడీ చేశారు. తాజాగా టీజర్ బయటికి వదిలారు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా "దోచేవారెవరురా" సినిమా టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ అంతా పంచ్ లతో త్వరలో ఓ మాంచి కామెడీ సినిమా రాబోతోందనే లీడ్ ఇచ్చింది. మీరూ ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.
రామ్ గోపాల్ వర్మ పీఎం అవుతాడు. పది లక్షలు పందెం కాస్తున్నట్లు మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఫన్నీగానే ఉంది. టీజర్ లో ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. గీత రచయిత చైతన్య ప్రసాద్ కుమారుడు ప్రణవ చంద్ర ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నాడు. టీజర్ లో అజయ్ గోష్ గెటప్,లుక్ ఇంట్రస్టింగ్ వుంది.
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా 'దోచేవారెవరురా' తెరకెక్కుతోంది. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఈ పాటను శివనాగేశ్వరరావుగారే రాయటం విశేషం.

దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న "దోచేవారెవరురా" కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
