Asianet News TeluguAsianet News Telugu

#Ayalaan:రవితేజను రావద్దన్నారు..శివకార్తికేయన్ కి వెల్కమ్ చెప్పారే!?.. దిల్ రాజు పై ట్రోల్స్

 నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఆయనతో పాటుగా సీడెడ్‌లో ఎన్‌.వీ ప్రసాద్‌, వెస్ట్‌ ఉషా పిక్చర్స్‌ వారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు.

Siva Karthikeyan #Ayalaan gets strong distributors backing in Telugu States jsp
Author
First Published Jan 8, 2024, 10:47 AM IST


ఈ సంక్రాంతి (Sankranthi)సినిమాల పరంగా చాలా వివాదాలను మోసుకొస్తోంది. పోటీ ఎక్కువై  బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడుతోంది.   సంక్రాంతికి రెడి అయిన ఐదు  సినిమాల్లో థియేటర్స్ సమస్య అంటూ  నిర్మాతలు మాట్లాడి రవితేజ  ఈగల్ సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. దిల్ రాజు ఇందులో కీలక పాత్ర వహించారు. మరో ప్రక్క గుంటూరు కారంకే థియేటర్స్ మొత్తం ఇస్తున్నారని హనుమాన్ కు ఇవ్వటంలేదనే టాక్ నడుస్తోంది. అందులోనూ దిల్ రాజ్ దే కీలక పాత్ర.  ఇప్పుడు ఈ సంక్రాంతి రేసులోకి మరో సినిమాని తీసుకు వస్తున్నారు. 

ఈ  సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.   శివ కార్తికేయన్‌    హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ 'అయలాన్‌'. ఏలియన్స్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది.   ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లో నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఆయనతో పాటుగా సీడెడ్‌లో ఎన్‌.వీ ప్రసాద్‌, వెస్ట్‌ ఉషా పిక్చర్స్‌ వారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అయా ఏరియాల్లో వీరందరూ కూడా చాలా స్ట్రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌గా గుర్తింపు ఉంది. తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకట్లేదు అనుకుంటున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి అయలాన్‌ చిత్రం వెళ్లిపోయింది.  దాంతో నిర్మాత దిల్ రాజు(Dil Raju) మీద సోషల్ మీడియాలో ఈ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  

Siva Karthikeyan #Ayalaan gets strong distributors backing in Telugu States jsp

లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెంపుడు జంతువులు, కీటకాల గురించి పట్టించుకునే రైతుగా కనిపించబోతున్నాడు శివ కార్తికేయన్. మనం నివసిస్తోన్న ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం అని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతాను అంటూ శివ కార్తీకేయన్ చెప్పడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సడెన్గా..పై నుంచి ఒక ఏలియన్ దిగుతుంది. హీరో శివ కార్తీకేయన్ లైఫ్ లోకి ఏలియన్ వచ్చాక..ఆయన లైఫ్ ఎలా మారింది? అనేది ట్రైలర్లో చూపించారు. మామూలుగా అమెరికాను అంతం చేయడానికే కదా వెళ్తారు..ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా అంటూ శివకార్తికేయన్..ఏలియన్ను అడిగే డైలాగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. విలన్  మల్టీ-మిలియనీర్ బిజినెస్ మ్యాన్ గా  (శరద్ కేల్కర్ పోషించాడు) విలన్ సృష్టించే విధ్వంసాన్ని..ఏలియన్ తో కలిసి హీరో ఎలా అరికట్టాడు? ఏలియన్ కు తోడుగా నిలిచిన హీరో ఏం చేశాడు? వంటి అంశాలను రేకేత్తించింది ట్రైలర్. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఎంటర్ టైనర్కి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios