హాలీవుడ్ రేంజ్‌లో.. శివకార్తికేయన్ ఏలియన్ సినిమా 'అయలాన్' టీజర్.. చూశారా?

తొలిసారిగా శివకార్తికేయన్ నటించిన సైఫై ఫిల్మ్ Ayalaan నుంచి టీజర్ విడుదలైంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్న టీమ్ తాజాగా హాలీవుడ్ రేంజ్ లో ఉండే టీజర్ ను రిలీజ్ చేశారు. 
 

Siva Karrthikeyans Ayalaan Movie Teaser Out now NSK

తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan)  రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటుంటారు. రొమాంటిక్ జోనర్ తో పాటు సామాజిక అంశాలతో కూడిని సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘మహావీరుడు’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఆయన కెరీర్ లోనే తొలిసారిగా సైంటిఫిక్ ఫిల్మ్ Ayalaanలో నటించడం విశేషం. శివకార్తికేయ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమానే 'అయలాన్'. ఏలియన్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పతాకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్. రవికుమార్ దర్శకుడు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న 'వరుణ్ డాక్టర్' సినిమా తర్వాత శివకార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.

'అయలాన్' అంటే 'ఏలియన్' అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. సంక్రాంతికి  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే... 'అయలాన్' టీజర్ ఒక విజువల్ గ్రాండియర్. రెండు నిమిషాల వ్యవధిలో కథను చెప్పడంతో పాటు ఎంత లావిష్, రిచ్‌గా సినిమా తీశారనేది చూపించారు. ఒక్కసారిగా భూమి మీద వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్ల గుడ్లు తవ్వకాల్లో బయట పడటం వంటివి చూపించి కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఒక్కసారి శివకార్తికేయన్ ఎంట్రీతో ఆసక్తి మరింత పెరిగింది. ప్రపంచాన్ని ఓ ఎనర్జీతో శాసించాలని శరద్ కేల్కర్ ప్రయత్నించడం, అతడిని ఎదుర్కోవడానికి సామాన్య యువకుడు ఏం చేశాడు? హీరో - ఏలియన్ మధ్య స్నేహం వల్ల ఏం జరిగింది? భూమి మీద ఏలియన్ ఏం చేసింది? ఇషా కొప్పికర్ గన్ పట్టుకుని ఏలియన్ ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? అనేది స్క్రీన్ మీద చూడాలి. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సూపర్బ్ ఉంది. టీజర్ చూస్తే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని అర్థం అవుతోంది. 

కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ''హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. టీజర్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్, పాటలు ఇంకా బావుంటాయి. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శివకార్తికేయన్, మా టీమ్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు'' అని చెప్పారు. ఈ చిత్రంలో ఇషా కొప్పికర్, 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా 'అయలాన్'కు వర్క్ చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios