బిగ్ బాస్ షో విజేతగా  నిలిచిన శివబాలాజి తాను పవన్ కళ్యాణ్ అభిమానినన్న శివ బాలాజి పవన్ అభిమానుల కారణంగానే గెలిచానన్న శిబాలాజి

సినీ నటుడు శివబాలాజీ.. ఆనందోత్సాహాల నడుమ తేలియాడుతున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -1 కి శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేక వెనకపడిపోయిన శివబాలాజీ... ఈ షోలో విజేతగా నిలవడం తో మళ్లీ సెలబ్రటీ స్టేటస్ ని అందిపుచ్చుకున్నాడు. తాను ఈ షోలో గెలవడానికి కారణం పవన్ అభిమానులనేని చెబుతున్నాడు శివ బాలాజి.

తనకు పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టం అని.. ఏడేళ్ళ క్రితం ‘అన్నవరం’ సినిమా చేస్తున్నప్పుడు తనకు పవన్ తో ఏర్పడిన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పాడు. తన గతేడాది పుట్టిన రోజు వేడుకలను ‘ కాటమరాయుడు’ చిత్ర షూటింగ్ లో పవన్ తోపాటు చేసుకోవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఆ రోజు తాను పవన్ కి ఒక కత్తిని బహుమతిగా ప్రకటించానని.. ఆ విషయాన్ని గుర్తించుకునే పవన్ అభిమానులు ఇప్పుడు నన్ను గెలిపించారని ఆనందం వ్యక్తం చేశాడు.

మొదట బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు.. తాను అంగీకరించలేదని చెప్పాడు. అయితే.. దానివల్లే కెరిర్ యూటర్న్ తీసుకుంటుందని తన సన్నిహితులు నచ్చచెప్పారని.. అందుకే వచ్చి ఇప్పుడు విజేతగా నిలిచానన్నాడు.