సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార సోషల్ మీడియాలో రోజు రోజుకు పాపులర్ అయిపోతోంది. ముద్దొచ్చే విధంగా చేసే అల్లరి చేష్టలతో అందరి దృష్టిని చిన్నవయసులోనే ఆకర్షించింది. ఇక ఫారెన్ టూరులకు వెళ్ళినపుడు, ఇంట్లో సరదాగా గడిపినప్పుడు నమ్రత, మహేష్ ఇద్దరూ కుమార్తె విశేషాలని సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. 

తాజాగా సితార యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అవును.. ఇది నిజమే. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలసి సితార అండ్ ఆద్య అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సితార పిల్లలకు ఇష్టమయ్యే వినోదాన్ని అందించబోతోంది. 

ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఫన్నీ వీడియోలు, గేమ్స్, టాస్క్స్ ఇలా వివిధ రకాలుగా చిన్నపిల్లలని ఎంటర్టైన్ చేయనున్నారు. యూట్యూబ్ ఛానల్ లో సితార హంగామా ఏ రేంజ్ కు వెళుతుందో వేచి చూడాలి.